RR vs PBKS: తెవాటియా.. మావోడి సెంచరీని అడ్డుకున్నావుగా! ఇక నీకు ఉంటది!!

ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. కేఎల్ రాహుల్ (91; 50 బంతుల్లో 7×4, 5×6), దీపక్ హుడా (64; 28 బంతుల్లో 4×4, 6×4) చెలరేగడంతో మొదట పంజాబ్ 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. రాజస్థాన్ పేసర్ చేతన్ సకారియా (3/31) ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 217 పరుగులే చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ (119; 63 బంతుల్లో 12×4, 7×6) సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది.
తెవాటియా సూపర్ క్యాచ్
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్ రాహుల్ తెవాటియా బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చేతన్ సకారియా వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతికి రాహుల్ మిడ్ వికెట్ మీదగా భారీ షాట్ ఆడాడు. చూస్తే కచ్చితంగా సిక్స్ అనిపించిందా షాట్. కానీ బౌండరీ లైన్ దగ్గర బంతిని గాల్లోనే అందుకున్న తెవాతియా.. ఆ ఊపులో లైన్ దాటేశాడు. కానీ ముందే బంతిని మైదానంలోకి విసిరిన అతడు మళ్లీ వచ్చి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో రాహుల్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఎంతపనిచేశావ్ తెవాటియా
కేఎల్ రాహుల్ జోరు చూస్తే కచ్చితంగా సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ రాహుల్ తెవాతియా అద్భుత క్యాచ్‌తో అతడి ఆశలకు గండికొట్టాడు. తెవాతియా పట్టిన క్యాచ్ నెట్టింట వైరల్ అయింది. సెంచరీ మిస్ అయినందుకు రాహుల్ అభిమానులు చాలా బాధపడుతున్నారు. 'ఎంతపనిచేశావ్ తెవాటియా', 'మావోడి సెంచరీని అడ్డుకున్నావుగా', 'ఇంకో మ్యాచులో నువ్ బౌలింగ్ చేయి.. అప్పుడు నీకు ఉంటది' అంటూ పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ టోర్నీలో రాహుల్ ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. 82 మ్యాచులు ఆడిన కేఎల్.. 2738 రన్స్ చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

గేల్ క్యాచ్ వదిలేసిన తెవాతియా
ఈ మ్యాచులోరాహుల్ తెవాతియా అద్భుత క్యాచ్ పట్టినా.. మరో సునాయాస క్యాచ్‌ను మాత్రం వదిలేశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్‌ని తెవాటియా నేలపాలు చేశాడు. ఆపై అతడు దంచికొట్టాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 15 పరుగులే వద్దే ఔటయ్యేవాడు. అతను ఇచ్చిన క్యాచ్‌ని బెన్ స్టోక్స్ బౌండరీ లైన్ వద్ద జారవిడిచాడు. ఇక దీపక్ హుడా ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఇచ్చిన క్యాచ్‌ని జోస్ బట్లర్ జారవిడిచాడు. ఇవే రాజస్థాన్ కొంపముంచాయి.

సకారియా స్టన్నింగ్ క్యాచ్
ఈ మ్యాచులో చేతన్ సకారియా కూడా ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. క్రిస్ మోరిస్ వేసిన 18 ఓవర్ ఆఖరి బంతిని నికోలస్ పూరన్ ఫైన్ లెగ్‌లో షాట్ ఆడగా.. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సకారియా సూపర్ డైవ్‌తో బంతిని పట్టుకున్నాడు. అయితే గాల్లోనే బంతిని అందుకున్న సకారియా.. కిందపడే క్రమంలో బంతిని నేలకు తాకిందా? అనే సందేహం కలగడంతో థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించాడు. అయితే బంతి నేలకు తాకిందనే ఆధారం లభించకపోవడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కు కట్టుబడి క్యాచ్ ఔట్ ఇచ్చాడు. సకారియా సూపర్ ఫీల్డింగ్‌కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
RR vs PBKS:అంపైర్ వార్నింగ్.. దెబ్బకి బౌలింగ్ శైలి మార్చేసిన రియాన్ పరాగ్! చివరికి ఏమైందంటే(వీడియో)