
మిడిలార్డర్ సమస్య:
పంజాబ్ కింగ్స్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్ రూపంలో పవర్ హిట్టర్లు ఉన్నారు. ఈ ఇద్దరు చెలరేగినా పరుగుల వరద ఖాయం. మ్యాచ్‌లో ఏ దశలోనైనా ఈ నలుగురూ హిట్టింగ్ చేయగలరు. అయితే మిడిలార్డర్ బలహీనత ఆ జట్టుని వెంటాడుతోంది. షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, సర్ఫరాజ్ ఖాన్ ఆశించిన మేర ఆడట్లేదు.
ఇక గ్లెన్ మాక్స్‌వెల్‌ని పంజాబ్ జట్టు వదులుకున్నప్పటికీ.. డేవిడ్ మలాన్‌తో అతని స్థానాన్ని భర్తీ చేయనుంది. మహ్మద్ షమీ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా.. రిలే మెరెడిత్, క్రిస్ జోర్దాన్, మొయిసెస్ హెన్రిక్స్, మురగన్ అశ్విన్, జై రిచర్డ్‌సన్ టచ్‌లోకి వస్తే పంజాబ్ మెరుగైన ప్రదర్శన చేయగలదు. అయితే రిలే మెరెడిత్, మొయిసెస్ హెన్రిక్స్ ఆడితే జోర్దాన్, మలాన్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

బట్లర్, స్టోక్స్‌పై ఆశలు
రాజస్థాన్ రాయల్స్ ఎప్పటిలానే జోస్ బట్లర్, బెన్ స్టోక్స్‌పై అతిగా ఆధారపడేలా కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ సంజు శాంసన్ జట్టుని నడిపించబోతుండగా.. యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, ప్రియమ్ గార్గె, శివమ్ దూబె, రాహుల్ తెవాటియాతో బ్యాటింగ్ ఆర్డర్ మంచి సమతూకంగా ఉంది. అయితే మిడిల్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు లేరు.
క్రిస్ మోరీస్ రాకతో ఆ జట్టు బౌలింగ్ విభాగం మెరుగైంది. ముస్తఫిజుర్ రెహ్మాన్, కార్తీక్ త్యాగి, జయదేవ్ ఉనద్కత్ అతనికి అండగా ఉందనున్నారు. ఈ ఏడాది గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ టీమ్‌కి దూరమవడం ఆ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ. బట్లర్, స్టోక్స్, మోరీస్ ఆడడం ఖాయం. దీంతో మిల్లర్, లివింగ్‌స్టోన్, టై, ముస్తఫిజుర్ మధ్య పోటీ నెలకొననుంది.

రికార్డులు
ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్, రాజస్థాన్ జట్లూ పేలవ ప్రదర్శన చేశాయి. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్.. ఆరింట్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టింది. రాజస్థాన్ కూడా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. దాంతో కనీసం ఈ ఏడాదైనా ప్లేఆఫ్‌కి చేరాలని ఈ రెండు జట్లూ ఆశిస్తున్నాయి.
ఇప్పటి వరకూ పంజాబ్, రాజస్థాన్ 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించింది. టీమ్స్ స్కోరు పరంగా చూసుకుంటే ఈ రెండు జట్లు తలపడిన సమయంలో భారీ స్కోర్లు నమోదవుతూ వస్తున్నాయి. ఇరు జట్లలోనూ హిట్టర్లు ఉండటమే దీనికి కారణం.

తుది జట్లు (అంచనా)
రాజస్థాన్: జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, శివం దుబే, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, లియామ్ లివింగ్‌స్టోన్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కట్, కార్తీక్ త్యాగి.
పంజాబ్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్.


Click it and Unblock the Notifications

ఆ వరల్డ్ రికార్డుకు 17 ఏళ్లు.. ఎవరికైనా సాధ్యం అయ్యేనా?










