For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వ‌ర‌ల్డ్ రికార్డుకు 17 ఏళ్లు.. ఎవరికైనా సాధ్యం అయ్యేనా?

On this day 17 years ago, Brian Lara registered highest individual score in Tests

హైదరాబాద్: క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి. బ్యాట్స్‌మన్‌, బౌలర్, ఫీల్డర్, కీపర్‌లు రికార్డులు నెలకొల్పుతుంటారు. ఆ రికార్డులను ఇంకొందరు బద్దలు కొడుతుంటారు. కానీ 17 ఏళ్ల కింద‌ట స‌రిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 12) న‌మోదైన ఓ రికార్డు ఇప్ప‌టికీ ప‌దిలంగానే ఉంది. ఎవ‌రూ క‌నీసం దాని ద‌రిదాపుల్లోకి కూడా ఇప్పటివరకు వెళ్లలేదు. లెజండరీ క్రికెటర్‌, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్ బ్ర‌యాన్ లారా ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 400 ప‌రుగులు చేసిన వ‌ర‌ల్డ్‌ రికార్డు అది. 2004, ఏప్రిల్ 10 నుంచి 14 మ‌ధ్య ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో లారా ఈ రికార్డును నెలకొల్పాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో క్వాడ్రపుల్‌ సెంచరీ (400 నాటౌట్‌) సాధించిన ఆటగాడిగా బ్ర‌యాన్ లారా చరిత్రలో నిలిచాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా బ్రేక్‌ చేయలేకపోయాడు. కేవ‌లం ఆరు నెల‌ల ముందే త‌న 375 వ‌ర‌ల్డ్ రికార్డును బీట్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ‌న్ మాథ్యూ హేడెన్ (380) నుంచి మ‌ళ్లీ రికార్డును లాగేసుకున్నాడు. 1994లో ఇంగ్లండ్‌పై 375 ప‌రుగులు చేసి ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు లారా. ప‌దేళ్ల పాటు ప‌దిలంగా ఉన్న ఆ రికార్డును జింబాబ్వేపై హేడెన్ తిర‌గ‌రాశాడు. కానీ ఆ సంతోషం, రికార్డు ఎక్కువ కాలం నిల‌వ‌లేదు.

2004లో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ సంద‌ర్భంగా స్టీవ్ హార్మిస‌న్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌, మాథ్యూ హోగార్డ్‌ల బౌలింగ్‌ను తుత్తునియ‌లు చేస్తూ బ్ర‌యాన్ లారా మార‌థాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 గంట‌ల పాటు క్రీజులో గ‌డిపిన లారా.. చివ‌రికి 582 బంతుల్లో 43 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 400 ప‌రుగుల రికార్డును అందుకున్నాడు. నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట ఈ చిర‌స్మ‌ర‌ణీయ‌మైన రికార్డుకు వేదికైంది. అప్పటి నుంచి 17 ఏళ్ల పాటుగా ఆ రికార్డు లారా పేరుపై ప‌దిలంగా ఉంది.

2019లో మాత్రం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్న‌ర్.. బ్ర‌యాన్ లారా రికార్డును బ్రేక్ చేస్తాడా అనిపించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వార్న‌ర్ 335 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే కెప్టెన్ టిమ్ పైన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయ‌డంతో.. వార్న‌ర్ ఆ రికార్డుకు 65 ప‌రుగుల దూరంలో నిలిచిపోయాడు. లేదంటే లారా రికార్డును వార్న‌ర్ బ్రేక్ చేసేవాడేమో. 1990లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన లారా ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో 501 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రికార్డును కూడా త‌న పేరిటే రాసుకున్నాడు. లారా 131 టెస్టుల్లో 11,953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 అర్థ శతకాలు ఉన్నాయి. 299 వన్డేల్లో 10,405 పరుగులు చేసిన లారా.. 261 ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 22,156 పరుగులు సాధించాడు. ఇందులో 65 శతకాలు, 88 అర్థసెంచరీలు ఉన్నాయి.

Story first published: Monday, April 12, 2021, 14:38 [IST]
Other articles published on Apr 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+