For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: ఈ తప్పిదాలే.. రాజస్తాన్‌ రాయల్స్ కొంపముంచాయి!!

IPL 2021, RR vs PBKS: 4 reasons why Rajasthan Royals lost yesterday match

ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 4 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (91: 50 బంతుల్లో 7x4, 5x6), దీపక్ హుడా (64: 28 బంతుల్లో 4x4, 6x6) దూకుడుగా ఆడటంతో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో కెప్టెన్ సంజు శాంసన్ (119: 63 బంతుల్లో 12x4, 7x6) వీరోచిత సెంచరీ బాదినా.. రాయల్స్‌‌కి ఓటమి తప్పలేదు. భారీ లక్ష్యంకు దాదాపు చేరువైన రాయల్స్.. తమ సొంత తప్పిదాలతోనే మ్యాచ్ చేజార్చుకుంది. అవేంటో ఓసారి చూద్దాం.

స్టార్ ఆటగాళ్ల క్యాచ్‌లు నేలపాలు

స్టార్ ఆటగాళ్ల క్యాచ్‌లు నేలపాలు

ఈ మ్యాచులో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం స్టార్ ఆటగాళ్ల క్యాచ్‌లను వదిలేయడమే. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 15 పరుగులే వద్దే ఔటయ్యేవాడు. రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ని బెన్‌ స్టోక్స్ బౌండరీ లైన్ వద్ద జారవిడిచాడు. ఇంకేముంది అతడు రెచ్చిపోయి ఆడాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో క్రిస్ ‌గేల్ ఇచ్చిన క్యాచ్‌ని రాహుల్ తెవాటియా నేలపాలు చేశాడు. ఇక దీపక్ హుడా ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఇచ్చిన క్యాచ్‌ని ఫీల్డర్ జోస్ బట్లర్ జారవిడిచాడు. అప్పటికి దీపక్ హుడా స్కోరు 39 పరుగులు మాత్రమే. రాహుల్, హుడా క్యాచులు పట్టుంటే.. పంజాబ్ అంత స్కోర్ చేసేదే కాదు.

పరాగ్‌ ఉండుంటే

పరాగ్‌ ఉండుంటే

ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన మురగన్ అశ్విన్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (25: 11 బంతుల్లో 1x4, 3x6) వరుస సిక్సర్లు బాదాడు. ఇదే ఓవర్‌లో శాంసన్ కూడా ఒక సిక్స్ బాదడంతో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 24 బంతుల్లో 48 పరుగులుగా మారిపోయింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన షమీ.. రెండో బంతికే పరాగ్‌ని ఔట్ చేసేశాడు. దాంతో అప్పటికే 19 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడి విడిపోయింది. ఆపై తెవాటియా, మోరీస్ భారీ షాట్లు ఆడలేకపోయారు. పరాగ్ మరో ఓవర్ ఔట్ కాకుంటే.. ఛేదన మరోలా ఉండేది.

 మోరిస్‌కు స్ట్రైక్ ఇచ్చిఉంటే

మోరిస్‌కు స్ట్రైక్ ఇచ్చిఉంటే

రాజస్థాన్‌ రాయల్స్‌ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో సంజు శాంసన్, క్రిస్ మోరిస్ ఉన్నారు. అర్ష్‌దీప్ సింగ్ చేతిలో బాల్ ఉంది. దీంతో అప్పటి జోరు చూస్తే.. రాయల్స్‌ సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్నారు. మొదటి బంతికి పరుగు రాకున్నా.. రెండో బంతికి శాంసన్ సింగల్ తీశాడు. మూడో బంతికి మోరిస్ మరో సింగల్ తీశాడు.

ఇక నాలుగో బంతికే శాంసన్ సిక్స్ బాదడంతో ఉంత్కంఠ తారాస్థాయికి చేరింది. ఐదవ బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా.. శాంసన్ తీయలేదు. ఇక చివరి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఒకవేళ చివరి బంతికి మంచి ఆల్‌రౌండర్‌ అయిన మోరిస్ స్ట్రైక్ తీసుకుంటే.. అతడు కనీసం ఫోర్ బాదినా మ్యాచ్ టై అయ్యేది. ఇక సిక్స్ బాదితే మ్యాచ్ గెలిచేది. శాంసన్ అతి విశ్వాసం రాయల్స్‌ కొంపముంచింది.

కేవలం ఒకే ఓవర్

కేవలం ఒకే ఓవర్

ఈ మ్యాచులో రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌ కేవలం ఒకే ఓవర్ వేశాడు. హిట్టర్ క్రిస్ గేల్‌ వికెట్ కూడా పడగొట్టాడు. ఆ ఓవర్‌ ఐదో బంతిని గేల్‌ భారీ షాట్‌ ఆడగా.. బెన్‌ స్టోక్స్‌ సూపర్ క్యాచ్‌ పట్టాడు. ఒక ఓవర్ వేసి 7 రన్స్ ఇచ్చినా కూడా కెప్టెన్ సంజు శాంసన్‌ అతనికి మరో ఓవర్ ఇవ్వకపోవడం విశేషం. మిగతా బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నా కూడా శాంసన్‌ వారికే బంతినిచ్చాడు. ఒకవేళ పరాగ్‌ బౌలింగ్‌ చేసుంటే.. ఫలితం మరోలా ఉండేది.

RR vs PBKS: తెవాటియా.. మావోడి సెంచరీని అడ్డుకున్నావుగా! ఇక నీకు ఉంటది!!

Story first published: Tuesday, April 13, 2021, 10:22 [IST]
Other articles published on Apr 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+