IPL 2021: కోహ్లీసేన జోరు కొనసాగెనా? ఆర్‌సీబీ సెకండాఫ్ షెడ్యూల్, అప్‌డేటేడ్ టీమ్ ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌కు మరో 7 రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలన్నీయూఏఈ గడ్డపై ప్రాక్టీస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కొంత మంది ఆటగాళ్లు మలిదశ మ్యాచ్‌లకు దూరంగా ఉండగా.. వారి స్థానాల్లో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సైతం యూఏఈలో అడుగుపెట్టారు. 6 రోజుల క్వారంటైన్ తర్వాత తమ జట్లతో కలవనున్నారు.
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కూడా టైటిలే లక్ష్యంగా సిద్దమవుతోంది. మలిదశ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో అబుదాబి వేదికగా సెప్టెంబర్ 20న జరిగే మ్యాచ్‌తో తమ వేటను ప్రారంభించనుంది.

ఫస్టాఫ్‌లో దుమ్మురేపిన కోహ్లీసేన
ఇక ఫస్టాప్‌లో దుమ్మురేపిన కోహ్లీసేన..7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన కోహ్లీసేన.. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది.
ఇక ఆర్‌సీబీ విజయాల్లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 223 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ సైతం 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 207 రన్స్ చేశాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ హర్షల్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7 మ్యాచ్‌ల్లో 17 వికెట్లతో టోర్నీ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ తర్వాత కైల్ జెమీసన్ 7 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.

జట్టులో భారీ మార్పులు..
కరోనా భయంతో లీగ్ మధ్యలోనే జట్టును వీడిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో ఆర్‌సీబీ.. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగాను తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో సెకండాఫ్ లీగ్‌కు దూరమైన డానియల్ సామ్స్ స్థానంలో శ్రీలంకకే చెందిన దుష్మంత చమీరాతో ఒప్పందం కుదుర్చుకుంది.
న్యూజిలాండ్ టీమ్ తరఫున బిజీగా ఉన్న ఫిన్ అలెన్ ప్లేస్‌లో టిమ్ డేవిడ్, గాయంతో దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆకాశ్ దీప్‌లు జట్టులోకి కొత్తగా వచ్చారు. అయితే భారత్ వేదికగా జరిగిన లీగ్‌లో చూపించిన జోరును ఆర్‌సీబీ.. అరబ్ గడ్డపై కొనసాగిస్తుందా? లేదా? అనేది చూడాలి.!

ఆర్‌సీబీ షెడ్యూల్..
| మ్యాచ్ వివరాలు | తేదీ | టైమ్ | వేదిక |
| ఆర్‌సీబీ X కోల్‌కతా | సెప్టెంబర్ 20 | రాత్రి 7.30 | అబుదాబి |
| ఆర్‌సీబీ X చెన్నై | సెప్టెంబర్ 24 | రాత్రి 7.30 | షార్జా |
| ఆర్‌సీబీ X ముంబై | సెప్టెంబర్ 26 | రాత్రి 7.30 | దుబాయ్ |
| ఆర్‌సీబీ X రాజస్థాన్ | సెప్టెంబర్ 26 | రాత్రి 7.30 | దుబాయ్ |
| ఆర్‌సీబీ X పంజాబ్ | అక్టోబర్ 3 | సాయంత్రం3.30 | షార్జా |
| ఆర్‌సీబీ X ఎస్ఆర్‌హెచ్ | అక్టోబర్ 6 | రాత్రి 7.30 | అబుదాబి |
| ఆర్‌సీబీ X ఢిల్లీ | అక్టోబర్ 8 | రాత్రి 7.30 | దుబాయ్ |

ఆర్‌సీబీ అప్‌డేటేడ్ టీమ్..
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, షాబాజ్ అహ్మద్, పవన్ దేశ్‌పాండే, గ్లేన్ మ్యాక్స్‌వెల్, సచిన్ బేబీ, రజత్ పటిదార్, మహమ్మద్ అజారుద్దీన్, కైల్ జెమీసన్, డాన్ క్రిస్టియన్, సుయేశ్ ప్రభుదేశాయ్, కేఎస్ భరత్, టిమ్ డేవిడ్, దుష్మంత చమీరా, వానిందు హసరంగా, ఆకాశ్ దీప్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications