For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI: అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. టీ20ల్లో తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచేందుకు!!

IPL 2021: Rohit Sharma 3 Sixes Away From Becoming 1st Indian Batsman to Record 400 Sixes in T20s

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 రెండో దశ ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కరోనా కారణంగా తొలి దశలో 29 మ్యాచ్‌లే సాధ్యం కాగా.. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబరు 15 వరకూ మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో జరగనున్నాయి.

దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాలు ఈ మ్యాచ్‌ల‌కి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మ్యాచ్‌తో రెండో అంచె పోటీలకు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.

 భారత తొలి క్రికెటర్‌గా

భారత తొలి క్రికెటర్‌గా

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 3 సిక్సర్లు కొడితే.. టీ20ల్లో 400 సిక్సర్లు నమోదు చేసిన భారత తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు. ఐపీఎల్‌ ఆరంభ సీజన్ 2008 నుంచి ఆడుతున్న రోహిత్.. ఇప్పటి వరకూ 207 మ్యాచ్‌లాడి 224 సిక్సర్లు బాదాడు. ఇందులో ముంబై టీమ్‌ తరఫున 173 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. 51 సిక్సర్లు దక్కన్ ఛార్జర్స్ తరఫున బాదాడు. రోహిత్ తొలి మూడు సీజన్లు దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. 2011లో ముంబై జట్టులోకి వచ్చిన రోహిత్.. ఇప్పటికి వరకు అదే జట్టులో కొనసాగుతున్నాడు.

3 సిక్సర్లు బాదితే

3 సిక్సర్లు బాదితే

భారత్ తరఫున 111 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 133 సిక్సర్లు బాదాడు. మిగిలిన 40 సిక్సర్లు దేశవాళీ టీ20 టోర్నీల్లో హిట్‌మ్యాన్ నమోదు చేశాడు. దుబాయ్ వేదికగా జరిగే మ్యాచులో 3 సిక్సర్లు బాదితే.. టీ20ల్లో 400 సిక్సర్లు నమోదు చేసిన భారత తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాని పరిశీలిస్తే.. రోహిత్ 397 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు. మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా (324 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (315), మాజీ సారథి ఎంఎస్ ధోనీ (303) టాప్-4లో కొనసాగుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే విండీస్ హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్ టాప్‌లో ఉన్నాడు. గేల్ టీ20ల్లో 1000 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.

IPL 2021 Points Table: టాప్‌లో ఢిల్లీ.. రెండులో చెన్నై! సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానం ఎక్కడో తెలుసా?

గేల్1

గేల్1

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు మాత్రం క్రిస్ గేల్. గేల్ ఇప్పటివరకు 140 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు. అతను ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కోసం ఆడుతున్నాడు. అంతకుముందు యూనివర్సల్ బాస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపును ఆడాడు. బెంగళూరు తరఫున అత్యధిక సిక్సర్లు (239) కొట్టిన ఆటగాడు గేల్. కీరన్ పొలార్డ్ మొదటి నుంచి ముంబై ఇండియన్స్ కోసం ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ముంబై తరఫున అత్యధిక సిక్సర్లు (211) కొట్టిన ఆటగాడు పొలార్డ్. ఎంఎస్ ధోనీ చెన్నై ఫ్రాంచైజీ కోసం అత్యధిక సిక్సర్లు కొట్టాడు. చెన్నై తరఫున ధోనీ 187 సిక్సర్లు కొట్టాడు.

15వేల మైలురాయి

15వేల మైలురాయి

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలు రాయిని హిట్‌మ్యాన్ అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 34357 రన్స్‌తో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ అజారుద్దీన్లు రోహిత్ కన్నా ముందున్నారు. ఓవరాల్‌‌గా 15వేల మైలురాయి ధాటిన జాబితాలో 39వ స్థానంలో నిలిచాడు. అయితే రోహిత్ మెజార్టీ పరుగులు వన్డేల్లో చేసినవే.

Story first published: Sunday, September 19, 2021, 11:01 [IST]
Other articles published on Sep 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+