For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Points Table: టాప్‌లో ఢిల్లీ.. రెండులో చెన్నై! సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానం ఎక్కడో తెలుసా?

IPL 2021 Phase 2 Points Table: Delhi Capitals on Top, Sunrisers Hyderabad in 8th place

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 రెండో దేశ ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఆదివారం మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మ్యాచ్‌తో రెండో అంచె పోటీలకు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ఆరంభం కానుంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా తొలి దశలో 29 మ్యాచ్‌లే సాధ్యం కాగా.. ఈరోజు నుంచి అక్టోబరు 15 వరకూ మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో జరగనున్నాయి. దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాలు ఈ మ్యాచ్‌ల‌కి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.

టాప్‌లో ఢిల్లీ

టాప్‌లో ఢిల్లీ

ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాప్‌లో నిలిచింది. రిషబ్ పంత్ సారథ్యంలో 8 మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఆరు విజయాలతో 12 పాయింట్లను ఖాతాలో వేసుకుని నెం.1 స్థానంలో ఉంది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఏడు మ్యాచ్‌లాడి ఐదు విజయాలు (10 పాయింట్లు) అందుకుని రెండో స్థానంలో నిలిచింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు మ్యాచ్‌లాడి ఐదు విజయాల (10 పాయింట్లు)తో మూడో స్థానంలో కొనసాగుతోంది. మలి దశ మ్యాచులలో ఢిల్లీ మరో రెండు విజయాలు అందుకుంటే.. ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అయినట్టే. ఇక చెన్నై, బెంగళూరు జట్లకు మూడు విజయాలు అవసరం.

ముంబై ప్లే ఆఫ్ చేరాలంటే

ముంబై ప్లే ఆఫ్ చేరాలంటే

రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్‌లాడి నాలుగు విజయాల (8 పాయింట్లు)తో టాప్-4లో కొనసాగుతోంది. ఎప్పుడూ ముందుడే ముంబై.. ఈసారి పాయింట్ల పట్టికలో వెనుకబడిపోయింది. భారత్ వేదికగా జరిగిన తొలి దశ మ్యాచులలో అన్ని విభాగాల్లో తేలిపోయిన రోహిత్ సేన.. యూఏఈలో అయినా చెలరేగాలని చూస్తోంది. ముంబై ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే.. ఇంకా నాలుగు విజయాలు అందుకోవాల్సి ఉంది. స్టార్ ప్లేయర్స్ అందరూ సత్తాచాటితేనే ముంబైకే బెర్త్ దక్కుతుంది. సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్‌కి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.

IPL 2021: ఎక్కువ సమయం బాల్కనీలో కూర్చున్నా.. ఎప్పుడూ అవే ఆలోచనలు: రిషబ్ పంత్

సన్‌రైజర్స్ జట్టుకు కష్టమే

సన్‌రైజర్స్ జట్టుకు కష్టమే

ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో చివరి నాలుగు స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్ (6 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (6 పాయింట్లు), కోల్‌కతా నైట్‌ రైడర్స్ (4 పాయింట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2 పాయింట్లు) ఉన్నాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ మినహా.. మిగిలిన మూడు జట్లు ఏడేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. పంజాబ్ మాత్రం ఆరు మ్యాచ్‌ల్ని మాత్రమే ఆడనుంది. రాజస్థాన్, పంజాబ్ జట్లకు ప్లే ఆఫ్‌కి అర్హత సాధించే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. పంజాబ్ కంటే రాజస్థాన్ జట్టుకే ఎక్కువ అవకాశం ఉంది. ఇక సన్‌రైజర్స్ జట్టు దాదాపు ప్లే ఆఫ్‌ బెర్త్ దూరం చేసుకున్నట్టే. ఉన్న ఏడు మ్యాచుల్లో ఆరు విజయాలు అందుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ల ఫామ్ చూసుకుంటే.. అన్ని విజయాలు అంటే కత్తిమీద సామే.

సునాయసంగా గెలిచేవి కూడా

సునాయసంగా గెలిచేవి కూడా

లీగ్ ప్రారంభానికి ముందే ఆ జట్టుకు గట్టిషాక్ తగిలింది. స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ క్రికెట్ జానీ బెయిర్ స్టో ఆఖరి నిమిషంలో లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్‌‌ను తీసుకుంది. అయితే భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ దారుణంగా విఫలమైంది. ఫస్టాఫ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఓడిన అన్ని మ్యాచ్‌లు సునాయసంగా గెలిచేవే. కానీ బలహీనమైన మిడిలార్డర్, పేలవ బ్యాటింగ్‌తో గెలిచే మ్యాచ్‌లను చేజార్చుకుంది. క్యాపిటల్స్‌తో సెప్టెంబర్ 22న దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరబాద్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత షార్జాలో పంజాబ్ కింగ్స్, దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

Story first published: Sunday, September 19, 2021, 10:12 [IST]
Other articles published on Sep 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+