
విచిత్రమైన వైఖరితో ఉన్నాడు
ఐపీఎల్ 2021 కోసం భారత్ చేరుకొని క్వారంటైన్ పూర్తిచేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్.. ప్రస్తుతం ఆ జట్టు ఆటగాళ్ల సాధనను పర్యవేక్షిస్తున్నాడు. తాజాగా పాంటింగ్ మాట్లాడుతూ... 'గతేడాది పృథ్వీ షా.. తన బ్యాటింగ్‌పై విచిత్రమైన వైఖరితో ఉన్నాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు నెట్స్‌లో బ్యాటింగ్ చేయడు. పరుగులు చేస్తుంటే నిరంతరం బ్యాటింగ్ చేస్తూనే ఉండాలనుకుంటాడు. నాలుగైదు మ్యాచుల్లో పదిలోపే ఔటయ్యాడు. మనం నెట్స్‌లో సాధన చేస్తూ ఎక్కడ తప్పు జరుగుతుందో చూద్దామని చెప్పాను. తనకు ఆసక్తిలేదని తేలిగ్గా చెప్పేశాడు' అని తెలిపాడు.

వైఖరి మార్చుకుంటే
'బహుశా పృథ్వీ షా ఇప్పుడు తన వైఖరి మార్చుకొని ఉండొచ్చు. కొన్ని నెలలుగా బాగా కష్టపడ్డాడు. అత్యుత్తమంగా ఆడితే సూపర్ స్టార్ అవుతాడు. షా పట్ల నేను కాస్త కఠినంగానే ఉన్నా. నువ్వు నెట్స్‌కి వెళ్లి సాధన చేయాలని గట్టిగా చెప్పాను. నువ్వు చెబుతున్న థియరీ పనిచేయదని చెప్పా. సరైన ఫలితాలు రాకపోతే.. కోచ్‌గా నేను వాళ్ల సన్నద్ధతను ప్రశ్నించగలను. సాధన చేయాలని చెప్పినా అతడు విన్లేదు. ఫలితంగా పరుగులు చేయలేదు. అతడు వైఖరి మార్చుకుంటే భారత్‌కు సుదీర్ఘంగా ఆడగలడు. బ్యాక్ ఫుట్, ఫ్రంట్‌ఫుట్‌ను చక్కగా ఆడతాడు. స్పిన్‌ను దూకుడుగా ఎదుర్కోగలడు' అని పాంటింగ్ పేర్కొన్నాడు.

పటిష్ఠంగా ఢిల్లీ
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తర్వాత అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. బ్యాటింగ్, బౌలింగ్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో తిరుగులేని బలాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో కచ్చితంగా టైటిల్‌కు ప్రధాన పోటీదారు అనడంలో సందేహం లేదు. గత సీజన్‌లోనే గొప్ప ప్రదర్శనతో తొలి టైటిల్ నెగ్గేలా కనిపించిన ఢిల్లీ.. ఫైనల్లో బలమైన ముంబై అడ్డుపడింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని చూస్తోంది. ఇక మరోవైపు గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఏ మేరకు రాణించగలడోననే ఆసక్తి రేకెత్తుతోంది.

విదేశీ ఆటగాళ్లలలో పోటీ
ఇప్పటికే జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్లు చాలదన్నట్లు.. వేలంలో స్టీవ్ స్మిత్, టామ్ కరన్, సామ్ బిల్లింగ్స్‌లను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. గత సీజన్‌కు దూరమైన క్రిస్ వోక్స్ తిరిగొచ్చాడు. మామూలుగా అయితే కాగిసో రబాడ, అన్రిచ్ నార్జ్ పేసర్లుగా జట్టులో కొనసాగుతారు. గత సీజన్‌లో మెరిసిన మార్కస్ స్టాయినిస్ ఆల్‌రౌండర్‌గా ఉంటాడు. మిగిలిన ఒక్క స్థానంలో శిమ్రాన్ హెట్‌మయర్ లేదా స్మిత్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. దాంతో కరన్, బిల్లింగ్స్, వోక్స్ ఆడే అవకాశాలు తక్కువే.
IPL 2021: కోహ్లీలోని ఆ లక్షాణాలన్నీ నాలో ఉండాలని కోరుకుంటున్నా: యువ ఓపెనర్


Click it and Unblock the Notifications












