SRH vs RCB: మరో 89 పరుగులే.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ! మ్యాచ్ గణాంకాలు, నమోదవనున్న రికార్డులు ఇవే!

చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ రోజు రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఫార్మాట్ ఏదైనా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఏ మ్యాచులోలో కూడా పలు రికార్డులపై కన్నేశాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 185 ఇన్నింగ్స్‌ల్లో 130.6 స్ట్రైక్ రేట్‌తో 38.1 సగటుతో 5911 పరుగులు చేశాడు. ఇంకో 89 పరుగులు చేస్తే.. టోర్నీ చరిత్రలో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ అవతరిస్తాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే.

వార్నర్ మరో 36 పరుగులు చేస్తే
ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సురేష్ రైనా (5422), రోహిత్ శర్మ (5292), శిఖర్ ధావన్ (5282), డేవిడ్ వార్నర్ (5257)లు విరాట్ కోహ్లీ తర్వాత ఉన్నారు. గతేడాది రైనా లీగ్ ఆడకపోవడంతో కోహ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. విరాట్ ఇప్పటి వరకు ఐదు సెంచరీలు నమోదు చేశాడు. లీగ్‌లో విండీస్ హార్డ్‌హిట్టర్ క్రిస్ గేల్ ఆరు శతకాలు బాదేశాడు. ఇక ఈ మ్యాచులో వార్నర్ మరో 36 పరుగులు చేస్తే.. రోహిత్, ధావన్‌లను అధిగమించనున్నాడు.

కోహ్లీ1
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు చేయడం ద్వారా సింగిల్ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును విరాట్ లిఖించాడు. ఆ సీజన్‌లో కోహ్లీ నాలుగు సెంచరీ బాది ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు. ఒక సీజన్‌లో అత్యథిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ (848 పరుగులు 2016 సీజన్‌లో) రెండో స్థానంలో ఉండగా.. కేన్ విలియమ్సన్ (735-2018 సీజన్‌లో) మూడో స్థానంలో ఉన్నాడు.

పదివేల పరుగులు పూర్తిచేయడానికి
టీ20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేసుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 236 పరుగులు అవసరం. క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్ మాత్రమే ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేశారు. గేల్ 13 వేలకు పైగా పరుగులు చేసి అందరికంటే టాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ యావరేజ్ 46.90గా ఉంది. ఇది విరాట్ మిగతా పొజిషన్ల యావరేజ్ కంటే ఎక్కువ. మిగతా పొజిషన్లలో అతడి యావరేజ్ 34.0 మాత్రమే.

విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే
# బెంగళూరు (చాంపియన్స్ లీగ్ టీ20, ఐపీఎల్ కలుపుకుని) తరఫున 50 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించడానికి ఇంకా నాలుగు హాఫ్ సెంచరీలు అవసరం.
# ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మార్కును చేరడానికి ఇంకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికు వరకూ 193 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
# ఐపీఎల్‌లో 50 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించడానికి ఇంకా ఆరు హాప్ సెంచరీలు అవసరం.
# ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియంలో 58.4 సగటుతో 409 పరుగులు చేశాడు.
# ఐపీఎల్‌లో సందీప్ శర్మ బౌలింగ్‌లో అత్యధికంగా ఏడుసార్లు ఔటయ్యాడు. ఈ రోజు కూడా సందీప్.. కోహ్లీని ఔట్ చేస్తే తన రికార్డు మరింత మెరుగవనుంది.
# ఈ రోజు మ్యాచులో బెంగళూరు స్పిన్నర్ సెంచరీ (100వ మ్యాచ్ ఆడనున్నాడు) కొట్టనున్నాడు.

టీమ్ రికార్డ్స్
బెంగళూరుపై హైదరాబాద్ పైచేయిలా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌ల్లో తలపడగా.. హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లకిగానూ ఏడింట్లో బెంగళూరు జట్టు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి పోరు చాలా ఆసక్తికంగా జరుగుతుంది. ఐపీఎల్‌లో బెంగళూరుపై ఇప్పటి వరకూ హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులుకాగా.. హైదరాబాద్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 227 పరుగులు.
SRH vs RCB: చెన్నైలో వర్షం.. హైదరాబాద్ vs బెంగళూరు మ్యాచ్ అనుమానమే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications