Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: ముంబై ఇండియన్స్ తర్వాత కోహ్లీసేనదే ఆ అరుదైన ఘనత!

IPL 2021: RCB vs RR Stats and Records Preview

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ విజయాలతో అదరగొడుతున్న రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో విజయంపై కన్నేసింది. గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టనుంది. అటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, ఇటు బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్న కోహ్లీ సేన బలంగా ఉంది. ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ.. తర్వాత సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌, కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌రైడర్స్‌పై ఈజీగా విక్టరీలతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది.

ఇదే జోరును కొనసాగిస్తూ రాజస్థాన్‌ను ఓడించాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో రెండింటిలో ఓడి డీలా పడింది. గత పోరులో చెన్నై చేతిలో చిత్తయిన ఆ టీమ్​ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని ఓడించి కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌ పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లు పలు రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.

200- ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. 13 ఏళ్ల లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్(207) తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా కోహ్లీ సేన నిలవనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఆర్‌సీబీకి 200వ మ్యాచ్. ఈ ఘనత సాధించిన సెకండ్ టీమ్‌‌గా కోహ్లీసేన గుర్తింపు పొందనుంది.

26- ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ మరో 26 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేయనున్నాడు. డేవిడ్ వార్నర్ తర్వాత ఈ ఘనతను అందుకోనున్నరెండో ఓవర్‌సీస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందనున్నాడు.

51-విరాట్ కోహ్లీ మరో 51 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 6000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నమోదు చేయనున్నాడు.

100- గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఒక సిక్స్ కొడితే ఐపీఎల్‌లో 100 సిక్స్‌ల మార్క్‌ను అందుకోనున్నాడు.

Story first published: Thursday, April 22, 2021, 13:54 [IST]
Other articles published on Apr 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+