For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: జోరుమీదున్న బెంగళూరు హిట్టర్! కోల్‌కతాను కలవరపెడుతున్న ఆ ఇద్దరి ఫామ్! విజయం ఎవరిది!

IPL 2021, RCB vs KKR Preview: Dream 11 Team Prediction, Playing 11 and pitch report

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో ఆసక్తికరమైన పోరుకి రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ ‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్, రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించిన కోహ్లీ సేన జోరుమీదుంటే.. ఆడిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించి, ఆ తర్వాత ముంబై చేతిలో ఓడిపోయిన కోల్‌కతా కాస్త ఢీలా పడింది.

అయితే కోల్‌కతాలో భారీ హిట్టర్లు ఉండడంతో ఈ రోజు గెలుపుపై నమ్మకంగానే ఉంది. అనిశ్చితికి మారుపేరైన ఈ రెండు జట్లు భారీ స్కోర్లు నమోదు చేయగలవు.. అదే సమయంలో తక్కువ స్కోరుకే కుప్పకూలగలవు. మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలు ఓసారి చూద్దాం.

మ్యాక్సీ ఒక్కడే

మ్యాక్సీ ఒక్కడే

పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ రాకతో బెంగళూరు జట్టు బ్యాటింగ్ బలపడింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ మ్యాక్సీ సత్తాచాటాడు. సహచరులు వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్నా క్రీజులో నిలిచిన మాక్స్‌వెల్.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా హిట్టింగ్ చేస్తున్నాడు. దీంతో ఈరోజు కూడా అతడిపై భారీ ఆశలు నెలకొన్నాయి. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. విరాట్ కోహ్లీ మెరుగైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోతున్నాడు. మిస్టర్ 360ఏబీ డివిలియర్స్ మొదటి పర్వాలేదనిపిస్తున్నాడు. బెంగళూరు బ్యాటింగ్ బలం ఈ నలుగురే.

హర్షల్‌పై భారీ అంచనాలు

హర్షల్‌పై భారీ అంచనాలు

షబాజ్ అహ్మద్ అదరగొడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్ మూడు వికెట్లు పడగొట్టి హీరో అయ్యాడు. మరోసారి అతడి నుంచి బెంగళూరు అదే ప్రదర్శన కోరుకుంటోంది. అయితే వాషింగ్టన్ సుందర్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు. సుందర్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. యుజ్వేంద్ర చహల్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు పడగొట్టలేకపోవడం కాస్త నిరాశకలిగించే అంశం. పేసర్లు మహ్మద్ సిరాజ్, కైల్ జెమీషన్, హర్షల్ పటేల్ ఆకట్టుకుంటున్నారు. ముంబైపై ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హర్షల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

కలవరపెడుతున్న మోర్గాన్, రసెల్ ఫామ్:

కలవరపెడుతున్న మోర్గాన్, రసెల్ ఫామ్:

కోల్‌కతా జట్టులో ఓపెనర్ నితీశ్ రాణా మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ కీలక సమయంలో అనవసరంగా వికెట్ చేజార్చుకుంటున్నాడు. దీంతో శుభారంభం దక్కడం లేదు. ఇయాన్ మోర్గాన్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రసెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నారు. వీరందరూ చెలరేగాల్సిన సమయం వచ్చేసింది.

ఇక రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ మిడిలార్డర్‌లో టీమ్‌ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ మరింత వేగంగా ఆడితే బాగుంటుంది. పాట్ కమిన్స్ చక్కగా బౌలింగ్ చేస్తున్నా.. ప్రసీద్ క్రిష్ణ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. రసెల్ వికెట్లు తీస్తుండటం సానుకూలాంశం. వరుణ్ చక్రవర్తి, హర్భజన్ సింగ్, షకీబ్ అల్ హసన్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. మ్యాచ్‌లను మలుపు తిప్పే ప్రదర్శన కనబర్చలేకపోతున్నారు. సమిష్టిగా రాణిస్తే విజయం కష్టమేమీ కాదు.

హెడ్ టు హెడ్ రికార్డులు

హెడ్ టు హెడ్ రికార్డులు

బెంగళూరు, కోల్‌కతా జట్లు ఇప్పటి వరకూ 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించగా.. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుపొందింది. కోల్‌కతా ఆధిక్యంలో ఉన్నా.. బెంగళూరు ఇప్పుడు ఊపుమీదుంది. బెంగళూరుపై ఓ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరోవైపు బెంగళూరు కూడా ఒక మ్యాచ్‌లో కోల్‌కతాపై 213 పరుగులు చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోల్‌కతా ఓ మ్యాచ్‌లో బెంగళూరుని 49 పరుగులకే కుప్పకూల్చగా.. బెంగళూరు ఓ సందర్భంలో కోల్‌కతాని 84 పరుగులకే ఆలౌట్ చేసింది. చెపాక్ వికెట్ బౌలర్లకు అనుకూలం. ఇన్నింగ్స్ సాగుతున్నా కొద్ది బ్యాటింగ్ కఠినంగా మారుతోంది. టాస్ గెలిచినా జట్టు బ్యాటింగ్ ఎంచుకోనుంది. 160 పరుగులు చేసినా గెలిచే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డాన్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.

కోల్‌కతా: శుభమన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ.

డ్రీం ఎలెవన్ టీం:

దినేష్ కార్తీక్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, ఇయాన్ మోర్గాన్, దేవదత్ పడిక్కల్, ఆండ్రీ రసెల్, గ్లెన్ మాక్స్‌వెల్, హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చహల్.

IPL 2021లో హ్యాట్రిక్ పరాజయాలు: ముంబై‌తో మ్యాచ్.. సన్‌రైజర్స్ ఓటమికి‌ కారణలు ఇవే!!

Story first published: Sunday, April 18, 2021, 13:00 [IST]
Other articles published on Apr 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+