
ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చిన భువీ
ముంబై ఇండియన్స్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ రెండు భారీ సిక్సులు బాదడంతో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఆ జట్టు 17 పరుగులు సాధించింది. ఆ ఓవర్ వేసింది మరెవరోకాదు.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్. పొలార్డ్ 22 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. భువనేశ్వర్ తన కోటా 4 ఓవర్లలలో 45 పరుగులిచ్చి దారుణంగా విఫలం అయ్యాడు. ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు. మిగతా బౌలర్లు బాగానే వేయడంతో ముంబైని 150 పరుగులకే పరిమితం అయింది. అయితే ఈ పరాజయానికి పొలార్డ్ కొట్టిన రెండు సిక్సులూ కీలకం అయ్యాయి. హైదరాబాద్ 13 పరుగుల తేడాతోనే ఓడింది. భువీ చివరి ఒకరు బాగా వేసుంటే సన్‌రైజర్స్ గెలిచేదే.

బెయిర్‌స్టో హిట్ వికెట్
డేవిడ్ వార్నర్‌తో ఓపెనింగ్‌కు వచ్చిన జానీ బెయిర్‌స్టో పవర్ ప్లేలో రెచ్చిపోయాడు. 4 సిక్సర్లు, 3 బౌండరీలతో 22 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో హిట్ వికెట్ అయ్యాడు. కీపర్ వెనకాల స్వీప్ షాట్ ఆడగా.. బెయిర్‌స్టో కుడి కాలు వికెట్లను తాకింది. దీంతో 67 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంకు తెరపడింది. ఆపై మ్యాచ్ చేజారిపోయింది. బెయిర్‌స్టో హిట్ వికెట్ కాకుండా ఉంటే.. సన్‌రైజర్స్‌కు గెలిచే అదృష్టం ఉండేదేమో.

వార్నర్ రనౌట్
డేవిడ్ వార్నర్ ఆఖరి వరకు లేకపోతే ఎంత నష్టమో తెలిసొచ్చింది. అప్పటి వరకూ మ్యాచ్‌పై ఆశలు వదిలేసినట్లు కనిపించిన ముంబై ఇండియన్స్.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్ తర్వాత అనూహ్యంగా పుంజుకుని ఆఖరికి 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. విజయానికి 52 బంతుల్లో 61 పరుగులు అవసరమైన దశలో.. పొలార్డ్ విసిరిన బంతిని బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా హిట్ చేసిన విరాట్ సింగ్ సింగిల్ కోసం వార్నర్‌ని పిలిచాడు. స్పందించిన వార్నర్ పరుగు అందుకోగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా వేగంగా స్పందించి బంతి నేరుగా వికెట్లపైకి విసిరాడు. ఆ బుల్లెట్ త్రోకి వార్నర్ బలయ్యాడు. వార్నర్ రనౌట్ కాకుండా ఉండిఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

సమద్ రనౌట్
కీలక వికెట్లు కోల్పోయినా అబ్దుల్ సమద్, విజయ్ శంకర్‌లు ఓ దశలో జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ 25 పరుగుల భాగస్వామ్యం చూసి సన్‌రైజర్స్ జట్టుకు గెలుపుపై మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ సమద్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత 8 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడ్డాయి. పరాజయం ఖాయం అయింది. సమద్ రనౌట్ కాకుండా ఉంటే సన్‌రైజర్స్ గెలిచేదేమో.

మిడిలార్డర్ వైఫల్యం
సన్‌రైజర్స్ మిడిలార్డర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మనీశ్ పాండే, విరాట్ సింగ్, అభిషేక్ శర్మలు చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌లో కొద్దిగా విజయ్ శంకర్ పోరాడినా ఆఖరిలో తేలిపోయాడు. రెండు సిక్సులు కొట్టి ఆశలు రేకెత్తించిన అతడు 28 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రాకు వికెట్ ఇచ్చాడు. జట్టు స్కోరు 90 పరుగులు ఉన్నప్పుడు వార్నర్ రనౌట్ అయితే.. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ 137 పరుగులకే జట్టు స్కోరును పరిమితం చేశారు. కేదార్ జాదవ్, కేన్ విలియంసన్ ఉండుంటే అరేంజ్ ఆర్మీ మ్యాచ్ గెలిచేదే.
MI vs SRH: ఎంఎస్ ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ!!


Click it and Unblock the Notifications












