కరోనా సోకొద్దని కోరుకున్నా.. బహుశా ఆ దేవుడు వినలేదేమో! కోహ్లీతో ఓపెనింగ్ చేసేందుకు ఎదురుచూస్తున్నా!

చెన్నై: కరోనా మహమ్మారి తనకు సోకొద్దని ఆ దేవుడుని కోరుకున్నానని, కానీ అది మన నియంత్రణలో లేని విషయని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అన్నాడు. ప్రస్తుతం లీగ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు. దేశవాళీ క్రికెట్లోని అద్భుత ఫామ్‌నే లీగులోనూ కొనసాగిస్తానని పడిక్కల్ ధీమా వ్యక్తం చేశాడు. గతనెల 22న పడిక్కల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతను ఆర్‌సీబీ క్యాంప్‌ను నుంచి నేరుగా హోం క్వారంటైన్‌కు వెళ్లి కోలుకున్నాడు. ఇక ఏప్రిల్ 7న చెన్నైలో బస చేస్తున్న ఆర్‌సీబీ క్యాంప్‌లో చేరాడు.

వైరస్ సోకొద్దని కోరుకున్నా
తాజాగా దేవదత్ పడిక్కల్ మాట్లాడుతూ... 'కరోనా నాకో ఎదురు దెబ్బ. వైరస్ సోకొద్దని కోరుకున్నా. కానీ అది మన నియంత్రణలో లేని విషయం. ఫిట్‌నెస్‌తో ఐపీఎల్‌కు సిద్ధంగా ఉండాలని భావించా. ఇప్పుడంతా బాగుంది. చురుగ్గా కదులుతున్నాను. వేగంగా పరుగెత్తుతున్నాను. బంతికి సరిగ్గా స్పందిస్తున్నాను. ఎందుకంటే ఐపీఎల్‌లో 100% సిద్ధంగా ఉండటం అవసరం' అని అన్నాడు. ఐపీఎల్ 2021లో ఆర్‌సీబీ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గత శుక్రవారం జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ పడిక్కల్ ఆడలేదు.

మెరుగయ్యేందుకు ప్రయత్నించా
ఐపీఎల్ 2020లో దేవదత్ పడిక్కల్ 15 మ్యాచుల్లో 473 పరుగులు చేశాడు. ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీలో 43.60 సగటుతో 218, విజయ్ హజారేలో 737 పరుగులు చేశాడు. 'గత ఐపీఎల్ నాకు అద్భుతంగా సాగింది. గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని జట్టుకు ఉపయోగపడ్డాను. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో రాణించాను. ప్రస్తుతం నా లయ బాగుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉంది. బ్యాటింగ్‌కు వెళ్లిన ప్రతిసారీ మెరుగయ్యేందుకు ప్రయత్నించా' అని పడిక్కల్ తెలిపాడు.

కోహ్లీతో ఓపెనింగ్ చేసేందుకు ఎదురుచూస్తున్నా
'నేనిప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేందుకు ఎదురుచూస్తున్నా. మా జట్టులో ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి సీనియర్లు ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో వారి నుంచి నేర్చుకుంటా. వీలైనంత నేర్చుకోవడమే నా పని. అభిమానుల మధ్య బ్యాటింగ్ చేయడం నాకిష్టం. త్వరలోనే వారు చూస్తుండగా.. ఆడే రోజులు రావాలని కోరుకుంటున్నా' అని ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ పేర్కొన్నాడు.

నేరుగా బబుల్‌లోకి
కరోనా నుంచి కోలుకుని మూడు రోజులు కూడా గడవక ముందే పడిక్కల్‌ను డైరెక్ట్‌గా ఆర్‌సీబీ టీం బయో బబుల్‌లోకి తీసుకురావడంపై ఇతర ఫ్రాంఛైజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేసాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వారం రోజుల తప్పనిసరి హోటల్ క్వారంటైన్ నిబంధనను.. పడిక్కల్ విషయంలో ఆర్‌సీబీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని ప్రాంఛైజీలు మండిపడ్డాయి. ఇలా చేయడం వలన ఇతర ఆటగాళ్లు కూడా వైరస్ బారిన పడే ప్రమాదముందని ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. హోమ్ క్వారంటైన్ అనే ఆప్షన్ ఎవరికీ లేనప్పుడు.. ఆర్‌సీబీ ఆటగాడికి మాత్రం ఎలా ఇస్తారని బీసీసీపై ప్రశ్నల వర్షం కురిపించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
RR vs PBKS: కొత్త పేరుతో పంజాబ్.. కొత్త కెప్టెన్‌తో రాజస్థాన్! సిక్సర్ల జడివాన మళ్లీ కురిసేనా! తుది జట్లు ఇవే