For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: మలిదశ లీగ్‌కు సరి కొత్తగా ముస్తాబవుతున్న ఫ్రాంచైజీలు!

IPL 2021: RCB finalise squad, KKR & Punjab Kings continue search for replacements

హైదరాబాద్: ఓ వైపు విరాట్‌‌‌‌ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు.. ఇంగ్లండ్‌‌ పర్యటనలో ఉండగా.. మరోవైపు యూఏఈ గడ్డపై ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌ సందడి మొదలైంది. కోహ్లీ, రోహిత్‌‌, బుమ్రా వంటి స్టార్లు ఇంగ్లిష్‌‌ టీమ్‌‌తో టెస్టు సిరీస్‌‌ ఆడుతుండగా.. ధోనీ, రైనా వంటి వెటరన్స్‌‌.. ఇషాన్‌‌ కిషన్‌‌లాంటి యంగ్‌‌స్టర్స్‌‌ వచ్చే నెల 19 నుంచి అరబ్‌‌ గడ్డపై జరిగే ఐపీఎల్‌‌ 14వ సీజన్‌‌ ఫేజ్‌‌2 కోసం రెడీ అవుతున్నారు..! చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌, ముంబై ఇండియన్స్‌‌ ఇప్పటికే యూఈఏ చేరుకొని ప్రాక్టీస్‌‌ షురూ చేశాయి..! ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కూడా అరబ్‌‌ గడ్డపై అడుగు పెట్టింది..! మిగతా ఫ్రాంచైజీలు కూడా ఈ నెలాఖర్లోగా యూఏఈ చేరుకొని ప్రిపరేషన్స్‌‌ స్టార్ట్‌‌ చేయాలని చూస్తున్నాయి..! అదే టైమ్‌‌లో కొత్త సీజన్‌‌ కాకపోయినప్పటికీ.. సెకండ్‌‌ ఫేజ్‌‌ కోసం పలు టీమ్స్‌‌లో మార్పులు జరుగుతున్నాయి..! తొలిసారి ట్రోఫీ నెగ్గాలని ఆశిస్తున్న ఆర్‌‌సీబీ టీమ్‌‌లోకి ముగ్గురు కొత్త ప్లేయర్లు వచ్చారు..! ఆ టీమ్‌‌ హెడ్‌‌ కోచ్‌‌ కూడా మారాడు..! మిగతా ఫ్రాంచైజీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి..! ఇంటర్నేషనల్‌‌ షెడ్యూల్‌‌, ఫారిన్‌‌ ప్లేయర్ల అందుబాటును దృష్టిలో ఉంచుకొని టీమ్‌‌లో మార్పులు చేసుకుంటున్నాయి..! ఓవరాల్‌‌గా అరబ్‌‌ గడ్డపై ఐపీఎల్‌‌ కోసం అన్ని ఫ్రాంచైజీలు.. కొత్త ప్లేయర్లతో సరికొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి..!

ఆర్‌సీబీలోకి ముగ్గురు..

ఆర్‌సీబీలోకి ముగ్గురు..

ఐపీఎల్‌‌‌‌ సెకండ్‌‌ ఫేజ్‌‌ కోసం రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్‌‌సీబీ) సరికొత్తగా రెడీ అవుతోంది. ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించి టీమ్‌‌ను మరింత బలోపేతం చేసుకుంది. ఇందులో భాగంగా లంక టాప్‌‌ స్పిన్నర్‌‌ వానిందు హసరంగ, పేసర్‌‌ దుష్మంత చమీరాతో పాటు బిగ్‌‌బాష్​లో దుమ్మురేపిన సింగపూర్​ ప్లేయర్​ టిమ్‌‌ డేవిడ్‌‌ను కొత్తగా టీమ్‌‌లోకి తీసుకుంది. ఆడమ్‌‌ జంపా, డానియల్‌‌ సామ్స్‌‌, ఫిన్‌‌ అలెన్‌‌ ప్లేస్‌‌లో ఈ ముగ్గుర్ని తీసుకున్నట్లు ఫ్రాంచైజీ శనివారం ప్రకటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆర్‌‌సీబీ హెడ్‌‌ కోచ్‌‌ సైమన్‌‌ కటిచ్‌‌.. పదవి నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ప్రస్తుతానికి కొత్త కోచ్‌‌గా ఎవరిని నియమించకపోయినా.. డైరెక్టర్‌‌ ఆఫ్‌‌ క్రికెట్‌‌గా వ్యవహరిస్తున్న మైక్‌‌ హెస్సన్‌‌.. చీఫ్‌‌ కోచ్‌‌గానూ కొనసాగుతాడని ఫ్రాంచైజీ తెలిపింది. ఆర్‌‌సీబీలోని మిగతా ఇండియన్‌‌ ప్లేయర్లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌, టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ శనివారం బెంగళూరుకు చేరుకున్నారు. ఏడు రోజుల క్వారంటైన్‌‌ తర్వాత ఈ నెల 29న యూఏఈ బయలుదేరుతారు. మిగతా ఇంటర్నేషనల్‌‌ ప్లేయర్లు 29 నుంచి అక్కడికి చేరుకుంటారు.

బట్లర్‌ ఔట్..‌‌‌‌‌ ఫిలిప్స్‌‌ ఇన్..‌‌

బట్లర్‌ ఔట్..‌‌‌‌‌ ఫిలిప్స్‌‌ ఇన్..‌‌

ఇంగ్లండ్‌‌‌‌ వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ జోస్‌‌‌‌ బట్లర్‌‌‌‌ యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌‌‌‌ 14 ఫేజ్‌‌‌‌-2కు అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు బట్లర్‌‌‌‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌ శనివారం ఓ ప్రకటన చేసింది. బట్లర్‌‌‌‌ భార్య లూసీ త్వరలో తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో బట్లర్‌‌‌‌ లీగ్‌‌‌‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. బట్లర్‌‌‌‌కు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌గా న్యూజిలాండ్‌‌‌‌ టాపార్డర్‌‌‌‌, వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ను రాయల్స్‌‌‌‌ జట్టులోకి తీసుకుంది.

హేజిల్‌‌‌‌వుడ్‌‌ రీఎంట్రీ..

హేజిల్‌‌‌‌వుడ్‌‌ రీఎంట్రీ..

ఆస్ట్రేలియా పేసర్‌‌ జోష్‌‌ హేజిల్‌‌వుడ్‌‌.. సెకండ్‌‌ ఫేజ్‌‌ మ్యాచ్‌‌లకు చెన్నైకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌‌ వెల్లడించారు. సీఎస్‌‌కే హేజిల్‌‌వుడ్‌‌ను 2020లో రూ.2 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఆ సీజన్‌‌లో మూడు మ్యాచ్‌‌లే ఆడిన తను ఐపీఎల్‌‌ 14 సీజన్‌‌ ఫస్ట్‌‌ ఫేజ్‌‌కు దూరంగా ఉన్నాడు. దీంతో జోష్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌గా ఆసీస్‌‌కే చెందిన బెరెన్‌‌డార్ఫ్‌‌ను సీఎస్‌‌కే టీమ్‌‌లోకి తీసుకుంది. కానీ బెరెన్‌‌డార్ఫ్‌‌ ఒక్క మ్యాచ్‌‌లోనూ బరిలోకి దిగలేదు. ఇప్పుడు జోష్‌‌ టీమ్‌‌లోకి రావడంతో టోర్నీ రీప్లేస్‌‌మెంట్‌‌ రూల్‌‌ ప్రకారం.. సీఎస్‌‌కే బెరెన్‌‌డార్ఫ్‌‌ను రిలీజ్‌‌ చేయాల్సి ఉంటుంది.

పంజాబ్‌లోకి కొత్త ముఖాలు..

పంజాబ్‌లోకి కొత్త ముఖాలు..

పంజాబ్‌‌ కింగ్స్‌‌ కూడా కొత్త ప్లేయర్ల కోసం ట్రై చేస్తోంది. జే రిచర్డ్‌‌సన్‌‌, రిలే మెరిడిత్‌‌ టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. వీళ్లలో ఒకరి ప్లేస్‌‌లో నేథన్‌‌ ఎల్లీస్‌‌ను తీసుకుంది. అయితే రెండో రీప్లేస్‌‌మెంట్‌‌ కోసం.. నీల్‌‌ వాగ్నర్‌‌ (న్యూజిలాండ్‌‌), నవీన్‌‌ ఉల్‌‌ హక్‌‌ (అఫ్గానిస్తాన్‌‌), జాసన్‌‌ బెరెన్‌‌డార్ఫ్‌‌ (ఆస్ట్రేలియా), క్రిస్‌‌ గ్రీన్‌‌ ( సౌతాఫ్రికా), అంకిత్‌‌ రాజ్‌‌పుత్‌‌ (ఇండియా) రేస్‌‌లో ఉన్నారు. మరో రెండు రోజుల్లో చీఫ్‌‌ కోచ్‌‌ అనిల్‌‌ కుంబ్లే తుది నిర్ణయం తీసుకోనున్నాడని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి.

Story first published: Sunday, August 22, 2021, 16:39 [IST]
Other articles published on Aug 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+