For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ తానే.. అంటూ రవీంద్ర జడేజా సంచలన ట్వీట్!

IPL 2021: Ravindra Jadeja expresses desire of leading CSK after MS Dhoni

దుబాయ్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా సంచలన ట్వీట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత చెన్నై జట్టు సారథ్య బాధ్యతలు తానే చేపడతానని పేర్కొన్నాడు. దాంతో ఈ ట్వీట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక వ్యవహారం తేడా కొడుతుందని గ్రహించిన జడేజా వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాడు. అయినప్పటీకీ ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్‌గా మారాయి. అప్పుడే ధోనీ పోస్ట్‌కు జడేజా ఎసరు పెట్టాడని, కెప్టెన్సీ చేయాలనే తన ఆసక్తిని పరోక్షంగా తెలియజేశాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన ఓ ఫ్యాన్ పేజీ 'సీఎస్‌కే ఆర్మీ ఫ్యాన్స్'లో 'ఎంఎస్ ధోనీ తర్వాత సీఎస్‌కే సారథ్య బాధ్యతలు తీసుకునేది ఎవరు?'అనే క్వశ్చన్ పోల్ పెట్టింది. దీనికి జడేజా తనదైన శైలిలో బదులిచ్చాడు. సింపుల్‌గా 8వ నెంబర్‌తో బదులిచ్చాడు. అది జడేజా జెర్సీ నంబర్. పరోక్షంగా తానే సీఎస్‌కే భవిష్యత్తు కెప్టెన్‌ ‌అని పేర్కొన్నాడు. కొద్దిసేపటి తర్వాతే ఆ ట్వీట్‌ను తొలగించాడు. అభిమానుల మాత్రం ఈ ట్వీట్ స్క్రీన్ షాట్స్‌ను వైరల్ చేస్తున్నారు.

జడేజా అర్హుడే..

జడేజా అర్హుడే..

ఇక ట్వీట్‌తో సంచలనంగా మారినా.. ధోనీ వారుసుడిగా చెన్నై సారథ్య బాధ్యతలు చేపెట్టేందుకు జడేజా అర్హుడే. 2009 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న జడేజా.. ధోనీ కనుసన్నల్లోనే స్టార్ ఆటగాడిగా ఎదిగాడు. కెరీర్ ప్రారంభం నుంచి సీఎస్‌కే ఆడుతున్నాడు. టీమ్‌పై నిషేధంతో రెండేళ్ల పాటు ఇతర ఫ్రాంచైజీకి ఆడినా.. సీఎస్‌కే రీఎంట్రీ‌తో మళ్లీ ఆ జట్టులో చేరాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లో అదరగొట్టే జడేజా.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న జడేజా.. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లోనూ దుమ్మురేపాడు. డౌన్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్‌‌కు వచ్చే జడేజా అద్భుత బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాలందించాడు. 160 స్ట్రైక్‌రేట్‌తో ఏడు మ్యాచ్‌ల్లో 131 రన్స్ చేశాడు. 6.7 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు. వైస్ కెప్టెన్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు జడేజా‌కు మార్గం సుగుమమైంది.

ఐపీఎల్ సందడి షురూ..

ఐపీఎల్ సందడి షురూ..

హోరాహోరీగా సాగిన భారత్-ఇంగ్లండ్‌‌ టెస్ట్ సిరీస్‌‌ కరోనా కారణంగా అర్ధంతరంగా ముగియగా.. ఇప్పుడు అందరి దృష్టి‌ ఐపీఎల్‌‌ 2021 మలిదశ లీగ్‌పై పడింది. భారత జట్టు కోచ్‌లు‌ కరోనా బారిన పడటంతో ఐదో టెస్టు ఆగిపోగా.. అనుకున్నదానికంటే ముందుగానే టీమిండియా ఆటగాళ్లు అరబ్‌‌ గడ్డపై అడుగు పెట్టారు. ఇంగ్లండ్‌‌ పర్యటనకు వెళ్లని ప్లేయర్లు, మాజీలు, యంగ్‌‌స్టర్స్‌‌ ఇప్పటికే దుబాయ్‌‌, అబుదాబీలోని తమ బేస్‌‌లో సన్నాహకాల్లో నిమగ్నమయ్యారు.

ఇప్పుడు టీమిండియా స్టార్స్‌‌తో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు‌ కూడా యూఏఈ చేరుకోవడంతో ఐపీఎల్‌‌ సందడి మొదలైంది. మైదానం‌ ప్రాక్టీస్‌‌లో కొందరు, నెట్స్‌‌లో మరికొందరు, క్వారంటైన్‌‌లో ఉన్నప్పటికీ హోటల్‌‌లోని జిమ్స్‌‌లో ఇంకొందరు చెమటలు చిందిస్తూ.. మెగా లీగ్‌‌ కోసం సిద్దమవుతున్నారు. అదే సమయం‌లో టీమ్‌‌ బాండింగ్‌‌పై కూడా ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ప్రాక్టీస్‌‌ తర్వాత టీమ్‌‌మేట్స్‌‌ అంతా ఆట, పాటలతో సేదతీరుతున్నారు. ఆదివారం ముంబై ఇండియన్స్‌‌, చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ మధ్య పోరుతో సెకండ్‌‌ ఫేజ్‌‌‌కు తెరలేవనుంది.

ఐపీఎల్ సెకండ్ పేస్‌కు ఫ్యాన్స్..

ఐపీఎల్ సెకండ్ పేస్‌కు ఫ్యాన్స్..

ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు గురువారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.iplt20.com నుంచి వాటిని కొనుగోలు చేసుకోవచ్చని టోర్నీ నిర్వహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కొవిడ్‌-19 నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. యూఏఈ నిబంధనలకు అనుగుణంగా ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నామని నిర్వహకులు ఒక ప్రకటనలో చెప్పారు. అయితే, ఎంతమంది అనుమతిస్తారనే దానిపై సరైన సమాచారం లేకపోయినా స్టేడియం కెపాసిటీలో సగం మందిని అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లను దుబాయ్‌, షార్జా, అబుదాబి మూడు వేదికల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, 2019 తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం ఇదే తొలిసారి.

Story first published: Wednesday, September 15, 2021, 21:37 [IST]
Other articles published on Sep 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+