Rajasthan Royals రాత మారేనా.. కొత్త కెప్టెన్.. ట్రోఫీ అందించేనా? బలాలు, బలహీనతలు!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అరంగేట్ర సీజన్‌లో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. క్రికెట్ బ్యాడ్‌బాయ్ షేన్ వార్న్ అద్భుతాలు చేయడంతో.. టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఇక ఆనాటి నుంచి నేటి వరకు లీగ్‌లో అనామక జట్టుగానే కొనసాగుతున్నది..! సీజన్లు గడుస్తున్నా.. ప్లేయర్లు మారుతున్నా.. రాయల్స్ రాత మాత్రం మారడం లేదు.! గతాన్ని పక్కనబెడితే.. ఈ సారి దిగ్గజ క్రికెటర్ సంగక్కర మార్గనిర్దేశనం, కొత్త కెప్టెన్ సంజూ సామ్సన్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్న ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల హిట్లర్లు.. సత్తాచాటగల దేశీయ కుర్రాళ్లు.. వెరసి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్న ఆ జట్టు.. ఏమేరకు రాణిస్తుందో.. ఈసారైనా తమ రాత మార్చుకుని టైటిల్ సాధిస్తుందో లేదో చూడాలి.!

సమష్టి ప్రదర్శన చేయలేక..
స్పాట్ ఫిక్సింగ్ కారణంగా రెండేళ్ల నిషేధాన్ని మినహాయిస్తే మిగిలిన పది సీజన్లలో కేవలం మూడుసార్లు మాత్రమే టీమ్ ప్లే ఆఫ్స్ చేరగలిగిందంటే జట్టు ఎంత పేలవంగా ఆడిందో అర్థమవుతుంది. ఇక గత సీజన్‌లో అయితే జట్టు చరిత్రలోనే పేలవంగా తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది. జట్టు బాగానే ఉన్నప్పటికీ.. సమష్టి ప్రదర్శన చేయడంలో విఫలమై అప్రతిష్ఠ మూటగట్టుకుంది. దీంతో నిరుడు సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌ను వదులుకున్న రాజస్థాన్.. యువ ఆటగాడు సంజు శాంసన్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. ఈ ఏడాది వేలంలో దూకుడుగా వ్యవహరించిన ఆ జట్టు లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర.. రూ.16.25 కోట్లతో ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను కొనుగోలు చేసింది. అతను జట్టుకు సమతూకం తెస్తాడని నమ్ముతోంది.

బలాలు
రాజస్థాన్ రాయల్స్‌కు ఆ జట్టు బ్యాటింగే ప్రధాన బలం. టీ20 ఫార్మాట్‌కు సరిపోయే కాంబినేషన్స్ అన్నీ రాజస్థాన్ జట్టులో ఉన్నాయి. వీళ్లు ప్రణాళిక ప్రకారం ఆడితే జట్టుకు తిరుగుండదు. జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, డేవిడ్ మిల్లర్‌లాంటి విదేశీ క్రికెటర్లపైనే బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. ప్రస్తుతం బట్లర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. స్మిత్, మిల్లర్ కుదురుకుంటే జట్టు బ్యాటింగ్‌కు డోకా లేదు.ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. జట్టుకు కొండంత అండ.
ఇక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శాంసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన రోజున అతనెంతటి విధ్వంసం సృష్టించగలడో అందరికీ తెలిసిందే. జట్టును నడిపించే నాయకుడి పాత్ర పోషించాల్సిన తను.. బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శిస్తే రాజస్థాన్‌కు తిరుగుండదు. మిడిలార్డర్‌లో రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా లాంటి కుర్రాళ్ల మెరుపు విన్యాసాలు గత సీజన్‌లో చూశాం. జట్టుకు అవసరమైన సమయాల్లో వాళ్లు భారీషాట్లతో ఆదుకున్నారు. హిట్టింగ్ సామర్థ్యం ఉన్న పేస్ ఆల్‌రౌండర్ దూబె కూడా ఈ సారి జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ అనుభవం మెండుగా ఉన్న మోరిస్ సైతం మ్యాచ్‌ను ముగించే సత్తా ఉన్నవాడే.

బలహీనతలు
అప్పటివరకు బాగానే ఆడినట్లు కనిపించినా.. టపటపా వికెట్లు కోల్పోవడం, ఒత్తిడిని జయించలేకపోవడం రాయల్స్‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. అలాగే నిలకడలేని బౌలింగ్.. ఆ జట్టును కొన్నేళ్ల నుంచి వెంటాడుతున్న సమస్య. బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించడం.. బౌలింగ్ వైఫల్యంతో దాన్ని కాపాడుకోలేకపోవడం ఆ జట్టుకు బలహీనతగా మారింది. గత సీజన్‌లోనూ ఇదే జరిగింది. గతేడాది అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన జోఫ్రా ఆర్చర్ ఒక్కడే ప్రభావం చూపగలిగాడు. కానీ గాయానికి శస్త్రచికిత్స కారణంగా అతను ఈ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడు. అతను లేకపోవడంతో భారమంతా మోరిస్‌పైనే పడనుంది.
అయితే తరచుగా గాయాల బారిన పడే అతనికి ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఈ ఏడాది వేలంలో రూ.కోటి పెట్టి కొనుక్కున్న ముస్తాఫిజుర్ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అతను ఇంకా భారత్ చేరుకోలేదు. ఈ పరిస్థితుల్లోనూ దేశీయ పేసర్లనూ నమ్ముకునే అవకాశలు కనిపించడం లేదు. ఉనద్కత్ నిలకడలేమి ఆందోళన కలిగించేదే. స్పిన్నర్లు తెవాటియా, శ్రేయస్ గోపాల్‌లపై ఆ జట్టు భారీ ఆశలతో ఉంది.

రాజస్తాన్ రాయల్స్ టీమ్
బ్యాట్స్‌మెన్: రియాన్ పరాగ్, మనన్ వోహ్రా, యశస్వీ జైస్వాల్, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, చేతన్ సకారియా
ఆల్‌రౌండర్స్: బెన్ స్టోక్స్, మహిపాల్ లోమ్రోర్, శివమ్ దూబే, శ్రేయాస్ గోపాల్, క్రిస్ మోరిస్
వికెట్ కీపర్స్: జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), అనుజ్ రావత్
బౌలర్స్: జోఫ్రా ఆర్చర్, జైదేవ్ ఉనాద్కట్, కేసీ కరియప్ప, కార్తీక్ త్యాగీ, మయాంక్ మార్కండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రాహుల్ తెవాటియా, ఆండ్రూ టై,
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications