RCB vs MI: రాహుల్.. ఎక్స్‌ట్రాలు ఎందుకయ్యా! (వీడియో)

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ స్టార్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ప్రవర్తనను తప్పబడుతూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికెట్ తీసిన ఆనందంలో రాహుల్ అతిగా ప్రవర్తించాడని, ఇది ఏమాత్రం సమంజసం కాదని ట్రోల్ చేస్తున్నారు. ఆర్‌సీబీ యువ బ్యాట్స్‌మన్, తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌ను ఔట్ చేసిన రాహుల్.. ఆ సంతోషంలో బిగ్గరగా అరుస్తూ ప్రత్యర్థి ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఏవో బూతు పదాలు మాట్లాడినట్లు అతని లిప్ మూమెంట్ ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 54 పరుగులతో చిత్తవ్వడంతో నెటిజన్లు రాహుల్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
కేసీఆర్ డైలాగ్‌తో..
'రాహుల్ ఎక్స్‌ట్రాలు ఎందుకయ్యా'అని తెలంగాణ సీఎం పాపులర్ డైలాగ్‌ను గుర్తు చేస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఓ రిపోర్టర్‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దాంతో రాహుల్ చాహర్‌పై కూడా అదే తరహా డైలాగ్‌తో సెటైర్లు పేల్చుతున్నారు. కొందరైతే రాహుల్ చాహర్ సెలెబ్రేషన్ వీడియోకు కుక్క మొరగుతున్న వాయిస్‌ను జత చేసి వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్ తీసిన రాహుల్ చాహర్.. నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చుకున్నాడు. ఇక ఇదే పిచ్‌పై యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లతో చెలరేగాడు.
టీ20 ప్రపంచకప్ ఆటగాళ్లు...
దాంతో ఈ ఇద్దరి మధ్య పోలిక తెస్తూ నెటిజన్లు.. భారత సెలెక్టర్లపై విమర్శలు కురిపిస్తున్నారు. ఫామ్ టెంపరరీ అని, క్లాస్ పర్మినెంట్ అని కామెంట్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాహల్‌కు బదులు రాహుల్ చాహర్‌కు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో రాహుల్ చాహర్‌ను మరీ ఎక్కువగా విమర్శిస్తున్నారు. రాహుల్ చాహర్‌తో పాటు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమవుతున్నారు. పాండ్యా నిన్న ఒక్క మ్యాచ్‌లోనే ఆడగా.. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్‌లో కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి 3 పరుగులు మాత్రమే చేశాడు. సూర్య, ఇషాన్ మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యారు. ఒక్క రోహిత్ మినహా అంతా విఫలమయ్యారు. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్‌సీబీ ఆల్‌రౌండ్ షో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56), విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) అర్ధ సెంచరీలు సాధించగా, తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హర్షల్ పటేల్ (4/17) 'హ్యాట్రిక్'తో చెలరేగగా... చహల్ 3, మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications