For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: మిస్ యూ.. ముంబై లేడీస్.. టేక్ కేర్.. మళ్లీ కలుద్దాం.. లవ్ యూ!

IPL 2021: Quinton de Kocks Wife Sasha Bids Emotional Farewell To Mumbai Indians Family

ముంబై: కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా తమ స్వస్థాలలకు తిరుగుపయనమయ్యారు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను ఆటగాళ్లతో పాటు వారి సతీమణులు కూడా ఎంతో మిస్సవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ ఓపెనర్, సౌతాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ సతీమణి షాషా హర్లీ డికాక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్‌‌తో ఈ విషయం స్పష్టమైంది.

ఈ సీజన్‌కు తన భర్తతో పాటు భారత్‌కు వచ్చిన షాషా... ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లను ఆస్వాదించింది. ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతూ తమ ప్లేయర్లను ఉత్సాహపరుస్తూ.. ఇతర క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లతో కలిసి తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంది. అయితే కరోనా కారణంగా లీగ్‌ మధ్యలోనే రద్దు కావడంతో తన భర్తతో కలిసి స్వదేశానికి వెళ్లిపోయిన షాషా ముంబై ఇండియన్స్ టీమ్‌ను, ఆ టీమ్ స్పెషల్ లెడీస్‌ను ఎంతలా మిస్సవుతున్నానో రాసుకొచ్చింది.

'ఐపీఎల్‌ను ఇంత త్వరగా వీడాల్సి వస్తుందని ఊహించలేదు. చాలా బాధగా ఉంది. కానీ ఐపీఎల్‌ జరిగినన్ని రోజులు ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీతో బాగా కలిసిపోయా.. ముఖ్యంగా స్పెషల్‌ లేడీస్‌.. ప్రెండ్స్‌ను చాలా మిస్సవుతున్నా. కానీ కరోనా కారణంగా అర్థంతరంగా వారిని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మీరంతా ఇంట్లోనే ఉంటూ మాస్క్‌లు ధరించి సురక్షితంగా ఉండండి. మనం మళ్లీ కచ్చితంగా కలుద్దాం లవ్ యూ.'అని ముంబై లెడీస్ ఫొటోను జత చేస్తూ క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.

ఇక డికాక్‌ ఈ సీజన్‌ ఆరంభంలో విఫలమైనా.. ఆ తర్వాత ఫామ్‌ అందుకొని మంచి ప్రదర్శన కనబరిచాడు. డికాక్‌ 6 మ్యాచ్‌లాడి 155 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఐపీఎల్‌లో 72 మ్యాచ్‌లాడిన డికాక్‌ 2,114 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 15 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Sunday, May 9, 2021, 18:04 [IST]
Other articles published on May 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+