Punjab Kings ఈ సారైనా పంజా విసురుతుందా..? జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఉన్న పేరు అండర్ డాగ్స్! స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం ఆ జట్టు ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఆ టీమ్ నైజం.! ఈ కారణంగానే గత 13 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ గెలవలేకపోయింది. ఆటగాళ్లు మారినా, కెప్టెన్లు, కోచ్‌లు మళ్లీ మళ్లీ మారినా... టీమ్ జెర్సీ రూపురేఖలు మార్చినా ఆ జట్టు రాత మాత్రం మారలేదు.
అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనల మెరుపులు తప్ప ఒక జట్టుగా పంజాబ్ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. ఇప్పుడు 'ఎలెవన్'ను పక్కన పడేసి టీమ్ పేరులో స్వల్ప మార్పుతో 'కింగ్స్'గానే వస్తున్న పంజాబ్ ఏప్రిల్ 9 నుంచి మొదలయ్యే ఐపీఎల్ సీజన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. కుంబ్లే శిక్షణలో, కేఎల్ రాహుల్ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతోంది. కింగ్స్‌గా వస్తున్న పంజాబ్ ఈ సారైనా పంజా విసురుతోందో లేదో చూడాలి.!

బలం, బలగం..
ప్రస్తుతం పంజాబ్ జట్టును చూస్తే తిరుగులేదనిపిస్తుంది. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, కొత్తగా వచ్చిన డేవిడ్ మలాన్.. ధనాధన్ క్రికెట్‌కు సరిపోయే ఆటగాళ్లు. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ముఖ్యంగా డేంజరస్ గేల్ ఈసారి మరింత కసితో కనిపిస్తున్నాడు. కెప్టెన్‌గా అదనపు ఒత్తిడి ఉన్నా.. రాహుల్ ఫామ్‌కు వచ్చిన ఇబ్బందేమి లేదు. నికోలస్ పూరన్, మయాంక్ అగర్వాల్‌తో టాపార్డర్ మరింత బలంగా కనిపిస్తోంది.

అనుకున్న విధంగా ఆటగాళ్లను
పది ఓవర్లు వీళ్లు చూసుకుంటే తర్వాత దేశవాళీ స్టార్లు షారుఖ్ ఖాన్, మన్‌దీప్‌లతో విదేశీ ఆల్‌రౌండర్లు ఆడుకుంటారు. వేలానికి ముందు పంజాబ్‌కు విదేశీ పేస్ బౌలర్లు, విదేశీ ఆల్‌రౌండర్ల అవసరం కనిపించింది. దానికి తగినట్లుగానే వారు తాము అనుకున్న విధంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకోలిగారు. ఇక బౌలింగ్‌లో షమీ, కొత్తగా వచ్చిన జాయ్ రిచర్డ్సన్ (రూ.14 కోట్లు), రిలీ మెరిడిత్ (రూ. 8 కోట్లు) కీలకం కానున్నారు. డొమెస్టిక్ సీజన్‌లో అదరగొట్టిన ఇషాన్ పొరెల్, జలజ్ సక్సేనా, సౌరభ్ కుమార్, ఉత్కర్ష్ సింగ్‌ల పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే టాలెంటెడ్ప్లేయర్లు ఎక్కువగా ఉండటంతో ఎవర్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకుంటారన్నదే కీలకం కానుంది.

బలహీనత..
ఒకరిద్దరు స్టార్ ప్లేయర్ల మీద జట్టు ఆధారపడటం పంజాబ్‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. వ్యక్తిగతంగా ప్రతి ప్లేయర్ స్టార్‌గా కనిపిస్తున్నా.. సమష్టిగా రాణించడంలోనే పంజాబ్ గత సీజన్లలో విఫలమైంది. పరస్పరం మద్దతు ఇచ్చుకోలేక.. కీలక సమయంలో ప్లేయర్లు తడబడుతున్నారు. ఇది అతిపెద్ద బలహీనతగా మారింది. మన్‌దీప్, దీపక్ హుడా,
సర్ఫరాజ్ ఖాన్ వంటి దేశవాళీ సీనియర్లు ఉన్నా వారిపై పూర్తిగా నమ్మకం ఉంచలేని పరిస్థితి. బౌలింగ్‌లో షమీకి అండగా నిలిచే వారు లేకపోవడం లోటు. కొత్తగా వచ్చిన జాయ్ రిచర్డ్సన్, రిలీ మెరిడిత్‌కు ఐపీఎల్ అనుభవం అంతగా లేదు. అండర్-19 ప్లేయర్ రవి బిష్ణోయ్ గత సీజన్‌లో పర్వాలేదనిపించాడు. రాహుల్, క్రిస్ గేల్, మలాన్ తర్వాత మిడిలార్డర్‌ను నడిపించే వారు ఎవరనేది కూడా తేలాల్సి ఉంది.

అంచనా..
టాప్ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు కాబట్టి ప్లే ఆఫ్‌కు చాన్స్ ఉంది. కాకపోతే గత సీజన్ మాదిరి కాకుండా వరల్డ్ క్లాస్ ప్లేయర్లందరూ అంచనాలను అందుకుంటే పంజాబ్‌ను కచ్చితంగా ప్లే ఆఫ్స్‌లో చూడొచ్చు. అయితే వీళ్లకు యంగ్‌స్టర్స్ కూడా తోడుగా నిలవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న. ఈనెల 12న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ జర్నీని మొదలుపెడుతుంది.

పంజాబ్ కింగ్స్
బ్యాట్స్‌మెన్: క్రిస్ గేల్, డేవిడ్ మలాన్, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, మన్‌దీప్ సింగ్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్,
ఆల్‌రౌండర్స్: హెన్రీక్స్, జలజ్ సక్సెనా, ఉత్కర్ష్ సింగ్, ఫాబియన్ అలెన్
వికెట్ కీపర్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ప్రభ్‌సిమ్రన్‌సింగ్
బౌలర్లు:
హర్‌ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, ఇషాన్ పోరెల్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, , దర్శన్ నల్కాండే, జై రిచర్డ్‌సన్, మెరిడిత్, , మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, సౌరభ్ కుమార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications