Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మాయిలతో చిందేసిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్.. వైరల్ వీడియో!

Chris Gayle Releases Music Video With Indian Rapper

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ నేపథ్యంలో యూనివర్స్ బాస్, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ మంచి జోష్‌లో ఉన్నాడు. మైదానంలో బరిలోకి దిగకముందే వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న గేల్‌ ప్రాక్టీస్‌తో పాటు వరుస ప్రమోషనల్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. మొన్న మైకెల్‌ జాక్సన్‌ మూన్‌వాక్‌ స్టెప్స్‌తో ఇరగదీసిన ఈ విండీస్ వీరుడు.. నిన్న పంజాబీ స్టార్‌ దలేర్‌ మెహందీ పాటకు డోలు వాయించాడు. తాజాగా గేల్‌ ర్యాప్ సాంగ్ పాడుతూ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టాడు.

ప్ర‌ముఖ ఇండియ‌న్ ర్యాప‌ర్ ఎమివే బాంటాయ్‌తో క‌లిసి అత‌ను ఓ మ్యూజిక్ వీడియో చేశాడు. కాగా ఈ వీడియోలో పలువురు యువతులు బికినీ ధరించి డ్యాన్స్‌ చేస్తుండగా గేల్‌ పాట పాడుతూ బాంటాయ్‌తో కలిసి చిందులేశాడు. ఈ సందర్భంగా గేల్‌ త‌నలోని ర్యాప్ సింగింగ్ టాలెంట్‌ను బ‌య‌ట‌పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను గేల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అయింది. 'జ‌మైకా టు ఇండియా అవుట్ నౌ'ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఇక గ‌త ఐపీఎల్‌ సీజన్‌లో గేల్‌ పంజాబ్ కింగ్స్ తరపున ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరమైనా..సెకండాఫ్‌లో విధ్వంసం సృష్టించాడు. తాను ఎంత విలువైన ఆటగాడినో తెలియజేశాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనే 288 పరుగులు చేశాడు. ప్రస్తుతం తాజా సీజన్‌ కోసం సమయాత్తం అవుతున్నాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌ను షురూ చేయనుంది.

Story first published: Sunday, April 11, 2021, 22:20 [IST]
Other articles published on Apr 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+