For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: షారుక్‌కు బౌలింగ్‌ వేసే ధైర్యం చేయడం లేదు.. అతడు పొలార్డ్‌ను గుర్తుచేన్నాడు: కుంబ్లే

IPL 2021: Punjab Kings coach Anil Kumble says Shahrukh Khan reminds me a bit of Kieron Pollard

ముంబై: తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్‌ షారుఖ్‌ ఖాన్‌పై పంజాబ్‌ కింగ్స్ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించారు. షారుఖ్‌.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ కీరోన్‌ పొలార్డ్‌ను గుర్తుకుతెస్తున్నాడన్నారు. గత ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో షారుఖ్‌‌ను పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 20లక్షలు ఉంటే.. ఏకంగా రూ. 5 కోట్ల 25 లక్షలకు ఇతర ప్రాంచైజీలతో పోటీపడి మరీ కొనుగోలు చేసింది. ప్రధానంగా ఒక హిట్టర్‌ కావాలనే ఉద్దేశంతో షారుఖ్‌పై ముందు నుంచి ఫోకస్‌ చేసింది పంజాబ్.

భారీ ధరకు

భారీ ధరకు

కుడి చేతి వాటం స్పిన్నర్‌ అయిన షారుఖ్ ఖాన్‌‌.. హార్ద్‌ హిట్టర్‌ కూడా. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఆకట్టుకోవడంతో షారుఖ్‌ వెలుగులోకి వచ్చాడు. మిడిల్, లోయర్‌‌ ఆర్డర్‌లో 30-40 పరుగులు సునాయాసంగా సాధిస్తూ ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే పంజాబ్‌ కింగ్స్ అతనిపై కన్నేసి.. భారీ ధరకు కొనుగోలుచేసింది. ప్రస్తుతం షారుఖ్‌.. పంజాబ్‌ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోచ్‌ అనిల్‌ కుంబ్లే అతడికి బౌలింగ్ వేసి మరీ పరీక్షించారు. ప్రాక్టీస్‌లో షారుఖ్‌ ఆకట్టుకోవడంతో.. అతడిని ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ కీరోన్‌ పొలార్డ్‌తో పోల్చారు.

బౌలింగ్‌ వేసే ధైర్యం చేయడం లేదు

బౌలింగ్‌ వేసే ధైర్యం చేయడం లేదు

తాజాగా అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ.. గతంలో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా పని చేసిన సమయంలో కీరోన్‌ పొలార్డ్‌కు నెట్స్‌ బౌలింగ్‌ వేసిన విషయాన్ని ప్రస్తావించాడు. 'నేను ముంబైతో కలిసి పని చేసిన సమయంలో పొలార్డ్‌ చాలా ప్రమాదకరంగా కనిపించేవాడు. నా వైపు స్టైయిట్‌ బంతిని కొట్టకు అని పదేపదే చెప్పేవాడిని. కానీ ఇప్పుడు షారుక్‌కు బౌలింగ్‌ వేసే ధైర్యం చేయడం లేదు. నా వయసు పెరిగింది. నా శరీరం బౌలింగ్‌ చేయడానికి సహకరించడం లేదు. దాంతో షారుఖ్‌కు కూడా బౌలింగ్‌ చేసే సాహసం చేయడం లేదు. అతని ప్రాక్టీస్‌ను గమనిస్తే.. పొలార్డ్‌ షాట్లే గుర్తుకు వస్తున్నాయి' అని అన్నారు.

ఇదే మొదటి ఐపీఎల్ సీజన్

ఇదే మొదటి ఐపీఎల్ సీజన్

‌షారుఖ్ ఖాన్‌కు ఇదే మొదటి ఐపీఎల్ సీజన్. ఐపీఎల్ 2020 వేలంలో అతనికి నిరాశే ఎదురైంది. దానికి ఏమాత్రం నిరాశ చెందని ఈ తమిళనాడు క్రికెటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరగదీశాడు. సెమీఫైనల్లో 19 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతేకాదు తమిళనాడు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకొని ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. మరి ఇప్పుడు ఎలా ఆడతాడో చూడాలి.

గేల్‌‌‌‌, మలాన్ ఆడితే

గేల్‌‌‌‌, మలాన్ ఆడితే

ప్రస్తుతం పంజాబ్ జట్టును చూస్తే తిరుగులేదనిపిస్తుంది. బ్యాటింగ్‌‌‌‌లో కేఎల్ రాహుల్‌‌‌‌, క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌, డేవిడ్‌‌ మలాన్.. ధనాధన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు సరిపోయే ఆటగాళ్లు. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌తో టాపార్డర్‌‌‌‌ మరింత బలంగా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్, మన్‌దీప్‌ల రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌‌‌‌లో షమీ,‌ రిచర్డ్సన్‌, మెరిడిత్‌ కీలకం కానున్నారు. ఇషాన్ పొరెల్, జలజ్‌ సక్సేనా, సౌరభ్‌ కుమార్, ఉత్కర్ష్‌ సింగ్‌‌లపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. టాప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ విన్నర్లు ఉన్నారు కాబట్టి పంజాబ్ ప్లే ఆఫ్‌‌‌‌కు వెళ్లే చాన్స్‌‌‌‌ ఉంది.

IPL 2021: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లోకి 'బిగ్‌ మ్యాన్'‌ వచ్చేశాడు!!

Story first published: Monday, April 5, 2021, 18:30 [IST]
Other articles published on Apr 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+