MI vs RCB: తొలి మ్యాచ్‌కు ముందు.. ముంబై ఇండియన్స్‌కి వార్నింగ్ ఇచ్చిన టీమిండియా మాజీ స్పిన్నర్!!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌కు సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, స్టార్లతో కళకళలాడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం రాత్రి 7. 30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలోమ్యాచ్ ఆరంభం కానుంది. రెండు జట్ల సారథులు భారత జట్టుకు రెండు కళ్లలాంటి వారు కావడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే మ్యాచ్ ముంగిట ముంబై జట్టుకు భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఓ చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఓవర్ కాన్ఫిడెంట్‌తో మ్యాచ్‌లు ఆడొద్దని సూచించాడు.

ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఆడొద్దు
తాజాగా స్పోర్ట్స్ టుడేతో ప్రగ్యాన్ ఓజా మాట్లాడుతూ... 'ముంబై జట్టు పటిష్టంగా ఉంది. మంచి సమతూకంతో కనిపిస్తోంది. గత రెండేళ్లుగా జట్టులో పెద్దగా మార్పులు జరగలేదు. ఈ ఏడాది మినీ వేలంలో కూడా రెండు మూడు స్థానాల్ని భర్తీ చేసుకునేందుకే ప్రాధాన్యమిచ్చింది. ఎందుకంటే.. ఆ జట్టు ఇప్పటికే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. వరుసగా 2019, 2020లో టైటిల్ గెలవడం ద్వారా ముంబై టీమ్ ఇప్పుడు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. విశ్వాసం ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్‌తో మాత్రం మ్యాచులు ఆడకూడదు' అని ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

హ్యాట్రిక్ కొడుతుందా
ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 13 సీజన్లు జరిగాయి. ముంబై ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టైటిల్స్ అన్నీ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబై గెలవడం విశేషం. ఒకవేళ ఈ ఏడాది కూడా టైటిల్‌ని గెలిస్తే.. టోర్నీ చరిత్రలో హ్యాట్రిక్ కొట్టిన ఏకైక జట్టుగా ముంబై నిలవనుంది. ఇప్పటికే టోర్నీలో అత్యధిక సార్లు (5) విజేతగా నిలిచిన జట్టుగా ముంబై కొనసాగుతున్న విషయం తెలిసిందే. చెన్నై 3 ట్రోఫీలతో రెండో స్థానంలో ఉంది.

రోహిత్ చేతిలో అత్యంత బలమైన జట్టు
అత్యంత బలమైన జట్టు రోహిత్ శర్మ చేతిలో ఉంది. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్.. ఇలా ఒకరి తర్వాత మరొకరు ప్రత్యర్థి బౌలర్లను పరీక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లతో అత్యంత బలమైన బౌలింగ్ దళం ముంబై సొంతం. ముంబై తుది జట్టులో ఆడే ప్రతిఒక్కరు కూడా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన వారే కావడం విశేషం. ముఖాముఖిలో 27 మ్యాచుల్లో 17 విజయాలతో ముంబై పైచేయి. అయినా కోహ్లీసేనను తక్కువ చేయలేం. ఈ రెండు జట్లు తలపడ్డ ఆఖరి ఐదు మ్యాచుల్లో పోరు హోరాహోరీగానే సాగింది.
'రాబోయే రోజుల్లో సింగిల్స్ తీయరేమో.. ప్రతి 2-3 బంతులకో సిక్సర్ బాదుతారు'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications