IPL 2021 Playoffs రేసుపై ఉత్కంఠ.. ఒక్క ప్లేస్ కోసం నాలుగు జట్లు పోటీ! ఆ జట్టుకే అడ్వాంటేజ్!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ తుది దశకు చేరుకుంది. కరోనా అడ్డంకులన్నిటినీ ధాటుకొని యూఏఈ గడ్డపై దిగ్విజయంగా ఈ మెగా లీగ్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. లీగ్ దశ మ్యాచ్‌లు చివరి దశకు చేరగా.. ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారింది. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా.. మూడో బెర్తును ఆర్‌సీబీ దక్కించుకుంది. దాంతో మిగిలిన ఒక్క బెర్త్ కోసం నాలుగు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
టాప్-4కి చాన్స్..
ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 18 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు శుక్రవారం ముగియనుండగా.. అప్పటికి పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించనున్నాయి.

కేకేఆర్‌కు అడ్వాంటేజ్..
ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. ఆ తర్వాత రెండు స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్ (10), ముంబై ఇండియన్స్ (10) ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ (4) ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. దాంతో.. ఇప్పుడు నాలుగో ప్లేఆఫ్ బెర్తు కోసం పోటీ.. కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్, ముంబై మధ్యే ఉండనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేకేఆర్‌కు అడ్వాంటేజ్ ఉంది. ఆ జట్టు మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. చిత్తుగా ఓడితే మాత్రం ఇతర జట్లకు అవకాశం ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందితే ఎవరితో సంబంధం లేకుండా కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్తుంది. ఓడితే మాత్రం రన్‌రేట్‌తో పాటు ముంబై ఇండియన్స్ ఫలితాలను బట్టి అవకాశం ఉంటుంది.

ముంబై ఇండియన్స్ గెలిచినా..
ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా ముంబై ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. మెరుగైన రన్ రేట్ లేని కారణంగా ఆ జట్టుకు అవకాశం లేదు. ఒకవేళ రాజస్థాన్ చేతిలో కేకేఆర్ ఓడితే మాత్రం అవకాశం ఉంటుంది. ఇక రాజస్థాన్ రాయల్స్.. ముంబై చేతిలో ఓడితే వారి పోరాటం ముగుస్తుంది. ఆ జట్టు ముంబైతో పాటు కేకేఆర్ ఆడనుంది. ఈ రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు కూడా పెద్దగా అవకాశాల్లేవు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనున్న ఆ జట్టు ఆ మ్యాచ్ గెలిచినా అవకాశం లేదు. ఇతర జట్ల ఫలితాలతో పాటు రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటేనే చాన్స్ దక్కుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications