For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs MI: కృనాల్ పాండ్యా X దీపక్ హుడా దంచికొట్టేదెవరో? పంజాబ్ జట్టులోకి ఆ సూపర్ బౌలర్ .. తుది జట్లు ఇవే!

IPL 2021: PBKS vs MI Predicted Playing 11, Dream11 Tips For Match 17

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్దమైంది. నిలకడలేని బ్యాటింగ్‌‌తో ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్, జట్టుగా విఫలమవుతున్న పంజాబ్ కింగ్స్ చెపాక్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై చిత్తుగా ఓడగా.. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది.

గత సీజన్‌లో సూపర్ ఓవర్స్ థ్రిల్లింగ్ అందించిన ఈ జట్లు ఈ సీజన్‌లో ఏం చేస్తాయో చూడాలి. ఇక కృనాల్ పాండ్యా- దీపక్ హుడా మధ్య ఉండే పోరుపై సర్వత్రా ఆసక్తినెలకొంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు ఈ ఇద్దరు గొడవపడటం.. దీపక్ హుడా బరోడా టీమ్‌ నుంచి వేటుకు గురవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫస్ట్ ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే దంచికొట్టిన దీపక్ హుడా.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడో చూడాలి. ముఖ్యంగా కృనాల్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడనే ఆతృత అందరిలో నెలకొంది.

బౌలింగ్ సెట్ అయితే..

బౌలింగ్ సెట్ అయితే..

టోర్నీని విజయంతో మొదలుపెట్టిన పంజాబ్ గత మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన పంజాబ్.. చెన్నై, సన్‌రైజర్స్‌తో జరిగిన పోటీల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాలు ఇస్తున్నా క్రిస్ గేల్, నికోలస్ పూరన్ వైఫల్యం పంజాబ్‌ను బాగా దెబ్బతీస్తోంది. దీపక్‌హుడా టచ్‌లో ఉండగా షారుఖ్ ఖాన్ బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. పంజాబ్ బౌలింగ్ యూనిట్ చాలా వీక్‌గా ఉంది. మహ్మద్ షమీ నేతృత్వంలోని బౌలర్లు అస్సలు ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో ముంబైతో మ్యాచ్‌కు బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేసే చాన్సుంది. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రావొచ్చు.

 హిట్టర్లు మెరిస్తేనే..

హిట్టర్లు మెరిస్తేనే..

ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలంటే డిఫెండింగ్ చాంపియన్ ముంబై తమ బ్యాటింగ్ సమస్యను పరిష్కరించుకుని తీరాలి. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ నిలకడగా పెర్ఫామ్ చేయడం లేదు. అడపాదడపా మెరిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కూడా సత్తా చూపెట్టాల్సి ఉంది. లేదంటే ఢిల్లీ మ్యాచ్ ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉంది. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో తమ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడతారని ముంబై మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బౌలింగ్‌లోనూ ముంబైకి కొన్ని సమస్యలున్నాయి. కోల్‌కతా, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో సూపర్ హిట్ అయిన ముంబై బౌలర్లు ఢిల్లీతో పోరులో మాత్రం తేలిపోయారు. దీంతో బౌలర్లు కూడా పుంజుకుంటేనే ముంబైకి అవకాశాలున్నాయి.

ముంబైదే పైచేయి..

ముంబైదే పైచేయి..

ఐపీఎల్‌లో ఈ ఇరు జల్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా.. 14 విజయాలతో ముంబైనే పై చేయిసాధించింది. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. గత రెండు సీజన్లలో మాత్రం ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ముంబై అలవోకగా గెలవగా.. సెకండ్ మ్యాచ్ డబల్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. చివరకు పంజాబే విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోయింది. పంజాబ్‌పై కీరన్ పోలార్డ్(498), రోహిత్ శర్మ(423), ముంబైపై రాహుల్(383), క్రిస్ గేల్‌కు మంచి రికార్డు ఉంది.

తుది జట్లు:(అంచనా)

తుది జట్లు:(అంచనా)

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్/కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, మోయిసెస్ హెన్రీక్స్, రవిబిష్ణోయ్, మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, అర్షదీప్

ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

డ్రీమ్ 11 ప్రిడిక్షన్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కృనాల్ పాండ్యా, ఫాబియన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మురుగన్ అశ్విన్, అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్

Story first published: Friday, April 23, 2021, 15:10 [IST]
Other articles published on Apr 23, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+