Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs KKR:తడబడిన పంజాబ్.. కేకేఆర్ ముందు ఈజీటార్గెట్!

Kolkata restrict Punjab to 123 despite Jordan cameo

అహ్మదాబాద్: కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ(3/30), సునీల్ నరైన్(2/22), ప్యాట్ కమిన్స్(2/31) బంతితో రఫ్పాడించడంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి ముందు 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. మయాంక్ అగర్వాల్(34 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 31), క్రిస్ జోర్డాన్(18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 30)మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. చివర్లో జోర్డాన్ భారీ సిక్సర్లు కొట్టడంతో పంజాబ్ ఆ స్కోర్ అయినా చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో ప్రసిధ్, సునీల్, కమిన్స్‌కు తోడుగా.. వరుణ్ చక్రవర్తీ, శివం మావి తలో వికెట్ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న కేకేఆర్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. దాంతో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(19), మయాంక్ అగర్వాల్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన కెప్టెన్ రాహుల్.. కమిన్స్ బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి క్రిస్ గేల్ రాగా.. పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది.

శివం మావి వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తొలుత అంపైర్ నాటౌటివ్వగా.. రివ్యూకెళ్లిన కేకేఆర్ ఫలితం రాబట్టింది. ప్రసిధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్‌లో దీపక్ హుడా(1) మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి పూరన్ రాగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ప్రసిధ్ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టిన అతను.. నరైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.

తన మరుసటి ఓవర్‌లో హెన్రీక్స్(2)ను బౌల్డ్ చేయగా.. పూరన్(19)ను వరుణ్ బోల్తా కొట్టించాడు. దాంతో 79 పరుగులకే పంజాబ్ 6 వికెట్లు కోల్పోయింది. ఓ భారీ సిక్సర్‌తో ఆశలు రేకెత్తించిన షారుఖ్ ఖాన్‌ను ప్రసిధ్ తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. కమిన్స్ 19వ ఓవర్‌లో రవిబిష్ణోయ్(1) ఔటవ్వగా.. జోర్డాన్ ఓ ఫోర్, సిక్స్ బాదడంతో 11 రన్స్ వచ్చాయి. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్‌లో జోర్డాన్ రెండు బారీ సిక్సర్లు కొట్టడంతో పంజాబ్ 121 పరుగులు చేయగలిగింది.

Story first published: Monday, April 26, 2021, 21:25 [IST]
Other articles published on Apr 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+