For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs DC:పూరన్ స్థానంలో మలన్!రబాడకు చోటు కష్టమే!ఢిల్లీ జోరును పంజాబ్ ఆపేనా!తుది జట్లు, రికార్డులివే!

IPL 2021: PBKS vs DC predicted playing 11, Preview and dream11 tips for match 29

అహ్మదాబాద్‌: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర సమరం జరగనుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఐదు విజయాలు సాధించగా.. అన్నే మ్యాచులు ఆడిన పంజాబ్ కేవలం మూడింట్లో మాత్రమే గెలుపొందింది.

ఇరు జట్లు కూడా తమ చివరి మ్యాచుల్లో గెలుపొంది మంచి ఉత్సాహంలో ఉన్నాయి. బెంగళూరుపై పంజాబ్.. కోల్‌కతాపై ఢిల్లీ మంచి విజయాలు అందుకున్నాయి. మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, రికార్డులు ఓసారి పరిశిలిద్దాం.

ఆశలురేపుతున్న రాహుల్, గేల్

ఆశలురేపుతున్న రాహుల్, గేల్

పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పేపరుపై చాలా బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడుతున్నారు. గత మ్యాచుల్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ ఫామ్, గాయం కారణంగా బెంగళూరుపై ఆడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్‌ గేల్ మ్యాచుకు అనుగుణంగా ఆడుతున్నాడు. అయితే దీపక్ హుడా, నికోలస్ పూరన్ విఫలమవుతున్నారు.

ముఖ్యంగా పూరన్ వరుస డకౌట్లతో నిరాశపరుస్తున్నాడు. దీంతో టీ20 నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌ డేవిడ్ మలన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆల్‌రౌండర్ మొయిసెస్ హెన్రిక్యూస్ వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతూ టీమ్‌కి భారంగా మారిపోయాడు.యువ హిట్టర్ షారూక్ ఖాన్ బంతిని బలంగా బాదుతున్నా.. ఫినిషర్ రోల్‌ని పోషించడం లేదు. మిడిల్ ఆర్డర్ ఆడితే పంజాబ్ మెరుగైన స్కోర్ చేసే అవకాశం ఉంది.

బ్రార్ మళ్లీ మెరిస్తే

బ్రార్ మళ్లీ మెరిస్తే

పంజాబ్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ పరుగులు కట్టడి చేస్తున్నా.. వికెట్లు మాత్రం పడగొట్టడం లేదు. ఇక మిడిల్ ఓవర్లలో పరుగులు ఎక్కువగా ఇస్తున్నారు.

ఒక ఎండ్‌లో స్పిన్నర్ రవి బిస్ణోయ్ పొదుపుగా బౌలింగ్ చేస్తుంటే.. మరో ఎండ్ నుంచి దీపక్ హుడా ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. క్రిస్ జోర్దాన్ కూడా తేలిపోతున్నాడు. మెరాడిత్ మాత్రం రాణిస్తున్నాడు. ఆల్‌రౌండర్ హర్‌ప్రీత్ బ్రార్ కొత్త ఆశలు రేపుతున్నాడు. మరోసారి బ్రార్ చెలరేగితే పంజాబ్ పని సులువే.

RR vs SRH:వార్నర్‌పై వేటు.. ఓపెనర్‌గా రాయ్‌!కేన్ మామ నాయకత్వంలోనైనా గాడిన పడేనా?తుది జట్లు ఇవే!

జోరుమీదున్న షా

జోరుమీదున్న షా

ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా ధాటిగా ఆడుతూ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. పవర్ ప్లే‌లో బౌండరీల వర్షం కురిపిస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా షా మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. స్టీవ్‌ స్మిత్ నెమ్మదిగా ఆడుతూ జట్టుకు భారంగా మారాడు. కెప్టెన్ రిషబ్ పంత్, హిట్టర్ షిమ్రాన్ హిట్‌మెయర్ ఫామ్ అందుకున్నారు. హిట్‌మెయర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. అయితే ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఫామ్ ఢిల్లీని ఆందోళనకు గురిచేస్తోంది. స్టోయినిస్ ఒక్కడు గాడిలో పడితే తిరుగుండదు. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.

రబాడ డౌటే

రబాడ డౌటే

ఢిల్లీ స్టార్ పేసర్ కగిసో రబాడ అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. పవర్‌ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేస్తున్న రబాడ.. స్లాగ్ ఓవర్లలో మాత్రం ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. అతడి స్థానంలో నోర్జ్ జట్టులోకి రావొచ్చు. ఇషాంత్ శర్మ, అవేష్ ఖాన్ మాత్రం మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. ఇక మిడిల్ ఓవర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు కూడా తీస్తున్నారు. కానీ స్టోయినిస్ బౌలింగ్‌లో తేలిపోతున్నాడు. మ్యాచ్‌లో ఒకటి లేదా రెండు ఓవర్లు మాత్రమే వేస్తున్నా స్టాయినిస్.. ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఐపీఎల్‌లో పంజాబ్, ఢిల్లీ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో పంజాబ్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ రెండు జట్లు తలపడిన సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పంజాబ్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులు కాగా.. ఢిల్లీపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 202. నరేంద్ర మోడీ పిచ్ బౌలర్లకు అనుకూలం. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 170-180 పరుగులు చేస్తే.. విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యాచుకు ఎలాంటి వర్షం ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

పంజాబ్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్/ప్రభ్‌సిమ్రాన్ సింగ్, క్రిస్‌ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్/ డేవిడ్ మలన్, హర్‌ప్రీత్ బ్రార్, షారూక్ ఖాన్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవి బిస్ణోయ్, క్రిస్ జోర్దాన్.

ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్, రిషబ్ పంత్, షిమ్రాన్ హిట్‌మెయర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, కగిసో రబాడ/అన్రిచ్ నోర్జ్, అవేష్ ఖాన్‌, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా.

Story first published: Sunday, May 2, 2021, 12:58 [IST]
Other articles published on May 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+