
ఓపెనర్‌గా రాయ్
తాజా సీజన్లో ఓటములతో విసిగిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సంస్కరణల బాట పట్టింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పజెప్పింది. రాయల్స్‌తో మ్యాచులో విదేశీ బృందం కూర్పులో మార్పులుంటాయని ఇప్పటికే స్పష్టం చేసింది. దాంతో వార్నర్ స్థానంలో ఎవరొస్తారోనన్న ఆసక్తి పెరిగింది.
వార్నర్‌పై కాబట్టి జేసన్ రాయ్‌కు తుది జట్టులో చోటు ఖాయమే. ఎందుకంటే వార్నర్ తరహాలోనే రాయ్ ఓపెనర్. ఇంగ్లండ్ జట్టుకు అతడు విధ్వంసకరమైన ఆరంభాలు ఇచ్చాడు. మంచి హిట్టర్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా బంతుల్ని అలవోకగా స్టాండ్స్‌కు తరలించగలడు. పైగా మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో మంచి అనుబంధం ఉంది.

బౌలింగ్‌లోనూ పదును తగ్గింది
జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతున్నా.. నిలకడగా రాణించలేకపోతున్నాడు. దాంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడుతోంది. మనీశ్ పాండే చెన్నైపై హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకోవడం కలిసొచ్చే అంశం. కేన్ విలియమ్సన్ ఎప్పటిలానే తన రోల్ పోషిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారానే సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. కేన్ మామ నాయకత్వంలోనైనా జట్టు గాడిన పడుతుందో చూడాలి. కేదార్ జాదవ్, విజయ్ శంకర్ బ్యాట్‌తో రాణించాలని హైదరాబాద్ ఆశిస్తోంది. బౌలింగ్‌లోనూ హైదరాబాద్ తేలిపోతుంది.
నటరాజన్, భువనేశ్వర్ టీమ్‌కి దూరమవడంతో.. ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ వారి లోటుని పూడ్చలేకపోతున్నారు. రషీద్ ఖాన్ ఒక్కడే కాస్త రాణిస్తున్నాడు. జగదీశ్ సుచిత్ మెరుపులు ఒక మ్యాచ్‌కే పరిమితమయ్యాయి. మెరుగైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్‌ని అడ్డుకోవాలంటే.. అంతకుమించి ప్రదర్శన చేయాలి.

సూపర్ ఫామ్‌లో బట్లర్
రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మెరుపు ఆరంభాలు ఇస్తున్నా.. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. మరో ఓపెనర్ జైశ్వాల్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్, శివమ్ దూబే మిడిల్ ఓవరల్లో ధాటిగా ఆడుతున్నారు. హిట్టర్ డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా కూడా జట్టుకు అండగా నిలుస్తున్నారు. బౌలింగ్లో చేతన్ సకారియా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. క్రిస్ మోరీస్ వికెట్లు పడగొడుతున్నా.. ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. జయదేవ్ ఉనద్కత్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ అంతంత మాత్రమే. తెవాటియా, పరాగ్ అంచులను అందుకోవట్లేదు. కలిసికట్టుగా రాణిస్తే విజయం సులువే.

హెడ్ టు హెడ్ రికార్డ్స్
ఐపీఎల్‌లో హైదరాబాద్, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఏడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ విజయం సాధించగా.. ఆరు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలుపొందింది. రాజస్థాన్‌పై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 201 పరుగులు కాగా.. హైదరాబాద్‌పై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 198. గత రెండు సీజన్లలో నాలుగు సార్లు ఈ రెండు జట్లు తలపడగా.. చెరో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
ఢిల్లీ పిచ్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలం. బౌండరీ సరిహద్దు కూడా చిన్నదే కావడంతో.. మొదటగా బ్యాటింగ్ చేరిన జట్టు 200లకు పైగా స్కోర్ చేసినా విజయంపై నమ్మకం ఉండదు. చెన్నై-ముంబై మ్యాచే ఇందుకు మంచి ఉదాహరణ. మ్యాచుకు ఎలాంటి వర్ష ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా)
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కత్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
హైదరాబాద్: జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, జగదీశ్ సుచిత్, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ.


Click it and Unblock the Notifications












