న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KL Rahul Trolls: అయ్యా రాహుల్.. ఆ ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా జట్టుకోసం ఆడయ్యా!

IPL 2021: PBKS skipper KL Rahul brutally trolled by netizens for his slow knock against DC

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా మరో ఓటమి చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (49 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఢిల్లీ సునాయస విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమికి ఆ జట్టు బౌలింగ్ ఓ కారణమైతే.. కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ మరో కారణమని ఆ టీమ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా.. రాహుల్ ధాటిగా ఆడకపోవడం జట్టును కొంప ముంచిందని అభిప్రాయపడుతున్నారు. పంజాబ్ ఓటమిపై ట్విటర్ వేదికగా ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

రాహుల్ సెల్ఫీష్..

పంజాబ్ ఇన్నింగ్స్‌లో 51 బంతులాడిన రాహుల్ 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69)ధాటిగా ఆడుతుండటంతో అతను యాంకర్ రోల్ పోషించాడు. అయితే కీలక సమయంలో తన ఇన్నింగ్స్ గేర్ మార్చి జట్టుకు భారీ స్కోర్ అందించడం రాహుల్ విఫలమయ్యాడు. దాంతో కేఎల్ రాహుల్ స్లో ఇన్నింగ్స్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీష్ ఇన్నింగ్స్‌లు ఆడటం మానేసి జట్టు కోసం ఆడాలని చురకలంటిస్తున్నారు. ఈ తరహా బ్యాటింగ్‌తో గత సీజన్‌లో చాలా మ్యాచ్‌లు ఓడిపోయామని గుర్తు చేస్తున్నారు. ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా జట్టు గెలుపుకోసం ఆడాలని కోరుతున్నారు.

ధావన్‌ను చూసి నేర్చుకో..

ఇక ఇన్నింగ్స్‌లో 43 శాతం బంతులాడి 119 స్ట్రైక్‌రేట్ స్కోర్ చేయడానికి రాహుల్‌కు సిగ్గుండాలని మండిపడుతున్నారు. ఆరంభం నెమ్మదిగా ఉన్నా.. ఆ తర్వాత జోరుగా ఎలా ఆడాలో శిఖర్ ధావన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. జట్టులో భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా, చేతిలో 8 వికెట్లున్నా అతను స్లోగా బ్యాటింగ్ చేయడం.. అది మంచి బ్యాటింగ్ ట్రాక్‌పై వికెట్ కాపాడటం సమంజసం కాదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అతను తన ఆట తీరును మార్చుకోవాలని లేకుంటే పంజాబ్ ముందు ముందు మరిన్నీ కష్టాలపాలవుతుందని హెచ్చరిస్తున్నారు.

పూరన్‌ పంపించడం..

సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్ వెనువెంటనే ఔటైన తర్వాత మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను పంపించకుండా పూరన్ పంపించడం కూడా పంజాబ్ ఓటమికి కారణమైందంటున్నారు. పూరన్‌కు బదులు దీపక్ హుడా లేదా షారుఖ్ ఖాన్‌ను పంపిస్తే జట్టు భారీ స్కోర్ చేసేదని కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏ జట్టు అయిన ఓ 20 పరుగులు ఎక్కువ చేయాలనే భావిస్తుందని, అదే జట్టు విజయానికి దోహద పడుతుందని, కానీ పంజాబ్ మాత్రం దాన్ని మరిచిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇక సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ కూడా జట్టును నిండా ముంచేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను 17వ ఓవర్‌లో 20 పరుగులిచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడని, చెత్త ఫీల్డింగ్‌ కూడా ఢిల్లీ కలిసొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

గెలిపించిన గబ్బర్..

ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), బర్త్‌డే బాయ్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, లుక్మాన్ మెరివాలా, కగిసోరబడా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 198 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. ధావన్‌కు తోడుగా పృథ్వీ షా(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), మార్కస్ స్టోయినిస్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో రిచర్డ్‌సన్ రెండు వికెట్లు తీయగా.. రిలే మెరిడిత్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Monday, April 19, 2021, 11:39 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X