ఈ సారి కేఎల్ రాహుల్ విధ్వంసం చూస్తారు.. ప్రత్యర్థులకు వసీమ్ జాఫర్ వార్నింగ్!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో కేఎల్ రాహుల్ పరుగుల విధ్వంసం చూస్తారని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీమ్ జాఫర్ అన్నాడు. గత సీజన్‌లో మిడిలార్డర్ బలహీనంగా ఉండటంతో రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడాడని, కానీ ఈ సారి టీమ్ బ్యాలెన్సంగా ఉండటంతో అతను స్వేచ్చగా చెలరేగుతాడని ప్రత్యర్థులను హెచ్చరించాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన వసీం జాఫర్.. పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

శైలికి భిన్నంగా..
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే తన సామర్థ్యానికి భిన్నంగా 129.35 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడంతో కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దాంతో 'స్ట్రైక్‌రేట్‌కు అతిగా ప్రాముఖ్యం ఇస్తున్నారు' అని రాహుల్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ను వెనుకేసుకొచ్చిన జాఫర్.. అతను నెమ్మదిగా ఆడటానికి గల కారణాన్ని వివరించాడు.

దూకుడు చూస్తారు..
'గతేడాది రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడాడు. ఐదో నంబర్ తర్వాత బ్యాటర్లు లేకపోవడం, గ్లెన్ మాక్స్‌వెల్ ఫామ్‌లేమితో చివరి వరకు బ్యాటింగ్ చేశాడు. అప్పగించిన పనిని పూర్తి చేసే బాధ్యతను అతడే తీసుకున్నాడు. కానీ ఈసారి దూకుడైన రాహుల్‌ను చూస్తారు' అని జాఫర్ స్పష్టం చేశాడు. ఆటగాళ్లు ఒడుదొడుకులు ఎదుర్కోవడం సాధారణమేనని జాఫర్ తెలిపాడు. ఏ ఆటగాడికైనా ఇలా జరుగుతుందని వివరించాడు. ఎక్కువ మ్యాచులు ఆడేకొద్దీ మరింత మెరుగవుతారని వెల్లడించాడు. రాహుల్ మూడు ఫార్మాట్లలో శతకాలు బాదేశాడని గుర్తుచేశాడు. అతని ఆట గురించి మిగతావాళ్లకన్నా అతడికే బాగా తెలుసన్నాడు.

మా టీమ్ బలంగా..
ఇక ఇంగ్లండ్‌తో టీ20ల్లో విఫలమైనా రాహుల్ వన్డేల్లో దూకుడుగా ఆడాడని జాఫర్ ప్రశంసించాడు. 'గత సీజన్‌తో పోలిస్తే ఈసారి మా జట్టు మరింత సమతూకంగా ఉంది. అప్పుడు మహ్మద్ షమీకి అండగా నిలిచే బౌలర్లు లేరు. ఇప్పుడు జే రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్ వంటి పేస్ బౌలర్లు దొరికారు. అర్షదీప్ సింగ్, ఇషాన్ పోరెల్, దర్శన్ నల్కండే వంటి ప్రతిభావంతులైన భారత పేసర్లూ మాకున్నారు. షారుక్ ఖాన్ వంటి ఫినిషర్ల కోసం మేం ఎదురుచూశాం. తమిళనాడుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించడంలో అతడిది కీలక పాత్ర. ఫాబియన్ అలెన్, ప్రభుసిమ్రన్ సింగ్ సైతం ఆకట్టుకుంటున్నారు' అని జాఫర్ తెలిపాడు.

పంజాబ్ కింగ్స్ టీమ్..
బ్యాట్స్‌మెన్: క్రిస్ గేల్, డేవిడ్ మలాన్, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, మన్‌దీప్ సింగ్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్,
ఆల్‌రౌండర్స్: హెన్రీక్స్, జలజ్ సక్సెనా, ఉత్కర్ష్ సింగ్, ఫాబియన్ అలెన్
వికెట్ కీపర్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ప్రభ్‌సిమ్రన్‌సింగ్
బౌలర్లు: హర్‌ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, ఇషాన్ పోరెల్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, , దర్శన్ నల్కాండే, జై రిచర్డ్‌సన్, మెరిడిత్, , మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, సౌరభ్ కుమార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications