2, 6, 6, 6, 4, 6: అరుదైన క్లబ్‌లో కమిన్స్.. గేల్, రైనా తర్వాత చోటు!!

హైదరాబాద్: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ సీజన్ హైవోల్టేజ్ మ్యాచ్‌ల్లో ఒకటి. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓడినా.. కోల్‌కతా అద్భుత పోరాటం అందరినీ ఆకట్టుకుంది.
దీపక్ చహర్ (4/29) అద్భుత బౌలింగ్‌తో ఓ దశలో 31/5తో నిలిచిన కోల్‌కతాను మెరుపు బ్యాటింగ్‌తో ఆండ్రీ రసెల్ (54; 22 బంతుల్లో 3×4, 6×6) పోటీలోకి తెస్తే.. పాట్ కమిన్స్ (66 నాటౌట్ 34 బంతుల్లో 4×4, 6×6) భీకర బ్యాటింగ్‌తో చెన్నైకి వణుకు పుట్టించాడు. అయితే మరోవైపు నుంచి అతడికి సహకారం లేకపోవడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.

ఒకే ఓవర్లో 30 పరుగులు
ఈ మ్యాచ్‌లో చెన్నై విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపు ఛేదించేంత పని చేశాడు పేసర్ పాట్ కమిన్స్. అయితే చివరలో ఇద్దరు బ్యాట్స్‌మన్ రనౌట్ అవ్వడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులు చేశాడు. చెన్నై పేసర్ సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు (2, 6, 6, 6, 4, 6) పిండుకున్నాడు. అందులో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. దీంతో కమిన్స్ ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు. ఐపీఎల్‌లో ఒకే ఓవర్లో 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కమిన్స్ నిలిచాడు.

గేల్1
పాట్ కమిన్స్ కంటే ముందు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆసీస్ హిట్టర్ షాన్ మార్ష్, యువ ఆటగాడు రాహుల్ తివాతియా ఒకే ఓవర్లో 30కి పైగా పరుగులు చేశారు. వీళ్లలో గేల్ 36 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత రైనా 32 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. మిగతా నలుగురూ (సెహ్వాగ్, మార్ష్, తివాతియా, కమిన్స్) 30 పరుగులు చేశారు. అంతేకాదు వీళ్లలో గేల్ మాత్రమే రెండుసార్లు ఒకే ఓవర్లో 30కి పైగా పరుగులు చేయడం విశేషం.

ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు
పాట్ కమిన్స్ ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదడం ఇది రెండోసారి. గతంలో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. రెండుసార్లు ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ కమిన్స్. ఇందులో క్రిస్ గేల్ (ఏడు సార్లు) తొలి స్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా (రెండు సార్లు)తో కమిన్స్ జత కలిశాడు. ఇక ఒకే మ్యాచులో బౌలింగ్ చేసి 50+ రన్స్ ఇచ్చి.. బ్యాటింగ్ చేసి 50+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కమిన్స్ మాత్రమే.

ప్రసిద్ధ్ రనౌట్ అవ్వడంతో
కోల్‌కతా చివరి నాలుగు ఓవర్లలో 45 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 17వ ఓవర్లో 5 పరుగులే ఇచ్చిన ఎంగిడి.. నాగర్‌కోటిని ఔట్ చేశాడు. 18వ ఓవర్లో శార్దూల్ 12 పరుగులిచ్చాడు. 19వ ఓవర్లో కరన్ 8 పరుగులే ఇచ్చాడు. రెండో పరుగు తీసే ప్రయత్నంలో అదే ఓవర్లో వరుణ్ రనౌటయ్యాడు. చేతిలో ఒక్క వికెట్ ఉన్న కోల్‌కతా.. ఆఖరి ఓవర్లో 20 పరుగులు చేయాలి. జోరు మీదున్న కమిన్స్ క్రీజులో ఉండడంతో అంతా ఉత్కంఠ నెలకొంది. కానీ 20వ ఓవర్ తొలి బంతి కమిన్స్ రెండో పరుగు తీయబోగా.. ప్రసిద్ధ్ రనౌటయ్యాడు. దీంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది.
వైరల్ ఫొటోస్.. మెహందీ ఫంక్షన్ వేడుకల్లో తళుక్కుమన్న జ్వాలా గుత్తా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications