కోహ్లీతో మాట్లాడినందుకేనా?
ఇంకొందరైతే.. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడినందుకే ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టారా? అని సెటైర్లు పేల్చుతున్నారు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఇషాన్ కిషనే. అతను కొట్టిన ఓ షాట్ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న రోహిత్ చేతికి బలంగా తాకింది. ఆ దెబ్బకు హిట్ మ్యాన్ నొప్పితో విలవిలలాడాడు.
ఆ అప్పటి వరకు బాగా ఆడిన రోహిత్.. గాయం తర్వాత భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో ముంబై ఇన్నింగ్స్ పేక మేడల్లా కూలింది. అయితే మ్యాచ్ అనంతం కన్నీటి పర్యంతమైన ఇషాన్ కిషన్‌ను కోహ్లీ ఓదార్చాడు. అతని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అభిమానులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రోహిత్‌పై సెటైర్లు పేల్చుతున్నారు.
ఐపీఎల్ టైటిల్ ఎక్కువ..
కీలక టీ20 ప్రపంచకప్ ముందు ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని ఓ అభిమాని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన ఇషాన్‌కు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అండగా నిలవాలని, అతన్ని ఓపెనర్‌గా ఆడించాలని సూచించాడు. తొక్కలో ఐపీఎల్ టైటిల్ కోసం ముంబై మేనేజ్‌మెంట్ ఇలా చేస్తుందనుకోలేదని, భారత జట్టుకు ఎంతో మంది ఆటగాళ్లను అందించిన చరిత్ర ఆ జట్టుదని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ కోసం అవసరమైతే ఐపీఎల్ టైటిల్ అయిన వదులుకునే టీమ్ ముంబై ఇండియన్స్ అని, ఇషాన్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాడు.
టీమ్ ప్రణాళికల్లో భాగంగానే..
ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ వెల్లడించాడు. టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఇషాన్‌ను పక్కనపెట్టామని, అంతకు మించి మరో కారణం లేదన్నాడు. తమ టీమ్ ఏ పరిస్థితుల్లో ఉందో తమకు బాగా తెలుసన్నాడు. తమ సామర్థ్యానికి తగిన ప్రదర్శన చేయలేదనేది కూడా వాస్తవేమనని, ఇది జట్టులోని ప్రతీ ఆటగాడికి అర్థమవుతుందన్నాడు.
తాము కొన్ని తప్పిదాలు చేశామని అవి ఈ మ్యాచ్‌లో సరిదిద్దుకుంటామని చెప్పాడు. ఈ క్రమంలోనే తుది జట్టు విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 11, 14, 9 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. ఈ పేలవ ప్రదర్శనతో అతను టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.
ముంబై మురిసింది..
తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(42), దీపక్ హుడా(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా చెరొక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 137 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్), సౌరభ్ తివారీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) రాణించారు. చివర్లో కీరన్ పొలార్డ్(7 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌తో హార్దిక్ ఫామ్‌లోకి రావడం అటు ముంబై.. ఇటు టీమిండియా శుభపరిణామం.


Click it and Unblock the Notifications
