
కొత్త నిబంధనల ప్రకారం..
ఐపీఎల్ జీసీ ఎంపిక చేసిన ఐదు వేదికల్లోనే మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో ఆయా ఫ్రాంచైజీల సొంత మైదానాలు ఉన్నా ఇతర ఫ్రాంచైజీలకు హోంగ్రౌండ్ లేకపోవడంతో బీసీసీఐ ఆయా ఫ్రాంచైజీల వేదికలను తారు మారు చేసింది. ఈ క్రమంలోనే ధోనీసేన ఆడే తొలి ఐదు మ్యాచ్‌లు ముంబైలో ఆడనుండగా.. ముంబై ఇండియన్స్ చెన్నై వేదికగా ఆడనుంది. దాంతో తమ ప్రాక్టీస్ క్యాంప్‌లను ఆయా నగరాల్లోనే నిర్వహించుకోవడం ఉత్తమమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.

26న ముంబైకి..
ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ త్వరలోనే ముంబైకి పయనం కానుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ విశ్వనాథన్ చెప్పారు. మార్చి 26న అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపారు. రైనా నేరుగా అక్కడికి చేరుకుంటారని అన్నారు. అయితే రైనా నేరుగా జట్టుతో కలవకుండా క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఏప్రిల్ 10న జరిగే తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే తలపడనుంది.
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు:రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్(వికెట్ కీపర్), రాబిన్ ఉతప్ప, ధోనీ(కెప్టెన్-వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రేవో, కరణ్ శర్మ, ఆర్ సాయి కిశోర్, మిచెల్ శాంటర్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, జోష్ హేజిల్‌వుడ్, కేఎమ్ ఆసిఫ్, మొయిన్ అలీ, కే గౌతమ్, ఛెతేశ్వర్ పుజారా, ఎమ్ హరిశంకర్ రెడ్డి, కే భగత్ వర్మ, సీ హరి నిషాంత్.

వచ్చేవారం చెన్నైకి..
ఇక ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంప్ కోసం వచ్చే చెన్నైలో అడుగుపెట్టనుంది. తమ ఆటగాళ్లంతా ఇంకా రావాల్సి ఉందని, ప్రస్తుతం వారంతా తమ జాతీయ జట్లకు ఆడుతున్నారని ముంబై ఫ్రాంచైజీ అధికారులు తెలిపారు. అందరూ రాగానే ప్రాక్టీస్ క్యాంప్ కోసం చెన్నైకి బయలుదేరుతామన్నారు. ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే కూడా వచ్చే వారం జట్టుతో కలుస్తాడని తెలిపారు. బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు నేరుగా జట్టులోకి తీసుకునే అవకాశంతో ఉండటంతో అన్ క్యాప్‌డ్ ప్లేయర్లను క్వారంటైన్‌కు రప్పిస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఏప్రిల్ 9న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.

ముంబై ఇండియన్స్ టీమ్:
రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, క్రిస్ లిన్, అన్మోల్ ప్రీత్ సింగ్, సౌరభ్ తివారీ, ఆదిత్యా తారే, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, అనుకుల్ రాయ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, మోహ్‌సిన్ ఖాన్, ఆడామ్ మిల్నే, నాథన్ కౌల్టర్ నీల్, పియూష్ చావ్లా, జేమ్స్ నీషమ్, యుధ్ వీర్ చరక్, మార్కో జన్‌సెన్, అర్జున్ టెండూల్కర్


Click it and Unblock the Notifications
