For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్స్‌మన్ X బౌలర్ మధ్యే యుద్దం.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లన్నీ అంతే: ధోనీ

IPL 2021: MS Dhoni’s says His Job Became Easy in The End After CSK Win Over KKR,
IPL 2021 : My Job Was Quite Easy Towards The End - MS Dhoni || Oneindia Telugu

ముంబై: థ్రిల్లింగ్ మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మన్, బౌలర్ మధ్యే పోటీ ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ‌అనంతరం మాట్లాడిన మహీ.. ఇలాంటి థ్రిల్లింగ్‌ మ్యాచులెప్పుడూ బాగుంటాయన్నాడు. భారీ స్కోర్ చేయడంతోనే విజయం దక్కిందన్నాడు. అలాగే హాఫ్ సెంచరీతో రాణించిన రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రశంసించాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు జట్టు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నాడు.

ఆ ఇద్దరి మధ్యే యుద్దం..

ఆ ఇద్దరి మధ్యే యుద్దం..

'థ్రిల్లింగ్ మ్యాచ్‌లు బాగుంటాయి. ఇందులో పోటీ కేవలం బ్యాట్స్‌మెన్‌, బౌలర్‌ మధ్యనే ఉంట. ఆ పోటీ 15వ ఓవర్‌ నుంచి మొదలవుతుంది. ఆటంతా మారిపోతుంది. అంతిమంగా ఎవరు బాగా ఆధిపత్యం చలాయిస్తే వాళ్ల జట్టే విజేత. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వెయ్యకూడదు. ప్రతి జట్టులోనూ ఇప్పుడు భారీ హిట్టర్లు ఉన్నారు. వాళ్లను బాగా నియంత్రించగలగాలి. మంచి స్కోరు సాధించడంతో గెలుపు దక్కింది. మా బ్యాటింగ్‌ కూడా బాగా మెరుగుపడింది. రుతురాజ్‌ చక్కటి ఆటతీరు కనబరిచాడు. అతడు గత ఐపీఎల్‌లో ఆడినట్లే ఇప్పుడూ ఆడాలి. నైపుణ్యం ఉన్నవాళ్లకు జట్టు మద్దతు ఎప్పుడూ ఉంటుంది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

టచ్‌లోకి వచ్చా..

టచ్‌లోకి వచ్చా..

ఈ మ్యాచ్‌లో 95 పరుగులతో అజేయంగా నిలిచి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాఫ్ డూప్లెసిస్ మట్లాడుతూ.. తన ఇన్నింగ్స్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లకు తాను టచ్‌లోకి వచ్చానన్నాడు. 'ప్రతిసారి మంచి ప్రారంభాలనే అందుకుంటున్నా. కానీ పూర్తిస్థాయిలో సాధికారంగా ఆడలేకపోయా. ఈరోజు ఆ సమస్యను అధిగమించాను. బ్యాట్‌ స్వింగ్‌ బావుంది. బంతి ఆగి వస్తుండటం గమనించి ఆడాం. జడేజా ఇలాంటి పిచ్‌ మీద ప్రభావం చూపిస్తాడు. గైక్వాడ్‌ టైమింగ్‌ అద్భుతం. అతని నైపుణ్యం మాకు తెలుసు. అతడికి కావాల్సిన ఆరంభం దొరికితే గొప్ప ఇన్నింగ్స్‌ ఆడగలడు. భారీ సిక్సర్లూ బాదగలడు. ధోనీతో ప్రయాణం బావుంది. అతనికి చేసే పనిమీద పూర్తి అవగాహన ఉంటుంది.'అని తెలిపాడు.

అద్భుత పోరాటం..

అద్భుత పోరాటం..

కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ ఓటమిపై స్పందిస్తూ.. తమది అద్భుత పోరాటమని తెలిపాడు. 'ఈ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. మాకో చేదు అనుభవం. అయితే.. రసెల్‌, కార్తీక్‌, కమిన్స్‌ల పోరాటం అద్వితీయం. వాళ్లు మ్యాచ్‌ మావైపు మొగ్గేలా చేశారు. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల ఆటను మెచ్చుకోవాలి. ఓటమి చాలా ఉద్వేగాన్ని ఇచ్చింది. తొలి ఐదు ఓవర్లకే టాప్‌ ఆర్డర్‌ వికెట్లన్నీ కోల్పోయి ఇంతలా నిలదొక్కుకుని ఆడటం అంత సులభం కాదు. రసెల్‌ పోరాటానికి మేం సహకరించలేకపోయాం. మా బౌలర్లు బాగానే బంతులేశారు. మేం మరింత పుంజుకోవాలి.'అని పేర్కొన్నాడు.

వణికించిన కమిన్స్, రస్సెల్

వణికించిన కమిన్స్, రస్సెల్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్‌ డు ప్లెసిస్‌ (60 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలువగా... రుతురాజ్‌ గైక్వాడ్‌ (42 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన కోల్‌కతాను ఆరంభంలో దీపక్‌ చహర్‌ (4/29) తన పేస్‌తో దెబ్బకొట్టినా... అనంతరం పుంజుకుని 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్‌గిడి (3/28) కూడా ఆకట్టుకున్నాడు.

ఓ దశలో కేకేఆర్ 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు ఘోరపరాభావం తప్పదని అంతా భావించారు. కానీ ప్యాట్‌ కమిన్స్‌ (34 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్‌ (22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో కేకేఆర్‌ను విజయానికి చేరువ చేశారు. చివర్లో టెయిలండర్స్ తడబటంతో ఓటమిపాలయ్యారు.

Story first published: Thursday, April 22, 2021, 15:23 [IST]
Other articles published on Apr 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+