సాక్షి సింగ్ భావోద్వేగం..
కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి ధనాధన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. సిక్స్‌తో మొదలు పెట్టిన మహీ.. ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఇక ధోనీ ఆటను చూసిన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. ధోనీ సతమణి సాక్షి సింగ్ సైతం తీవ్ర భావోద్వేగానికి గురైంది. ధోనీ ఆటను చూసి ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటూ.. చెమ్మగిల్లింది. కూతురు జీవాను హత్తుకొని మరి మహీ ధాటైన ఇన్నింగ్స్‌ను ఆస్వాదించింది. టామ్ కరన్ వేసిన ఆఖరి బౌలింగ్‌లో ఫోర్‌తో ధోనీ మ్యాచ్‌ను ముగించగానే.. గ్యాలరీలోని సాక్షి సింగ్ ఎగిరి గంతేసింది. ప్రస్తుతం సాక్షి సింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రాణించిన రాబిన్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), కెప్టెన్ రిషభ్ పంత్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్) ధాటిగా ఆడారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63) రాణించారు. కెప్టెన్ ధోనీ (6 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో చెన్నైను విజయతీరానికి చేర్చాడు.

సూపర్ సిక్స్‌తో..
చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 24 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటి వరకూ ఛేదనలో చెన్నైకి అండగా నిలిచిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయ్యాడు. దాంతో మొయిన్ అలీతో పాటు అప్పుడే క్రీజులోకి వచ్చిన ధోనీపై భారం పడింది. అవేష్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో ఓ అద్భుత సిక్స్‌తో మహీ పరుగుల ఖాతా తెరిచాడు. మహీ కొట్టిన 84 మీటర్ల భారీ సిక్స్‌కు మైదానం హోరెత్తింది. అభిమానులతో పాటు ధోనీ సతీమణి సాక్షి కూడా ఆనందంలో గంతులేశారు. అదే ఓవర్‌లో అలీ కూడా ఓ ఫోర్ కొట్టడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. దాంతో చెన్నై గెలుపు సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది.

చిన్నారికి గిఫ్ట్..
చివరి ఓవర్‌లో టామ్ కరన్ బౌలింగ్‌కి రాగా.. మొదటి బంతికే మొయిన్ అలీ (16) ఔట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. ఒత్తిడిలోనూ మ్యాచ్‌లను ఎలా ఫినిష్ చేయాలో తెలిసిన ధోనీ.. వరుసగా రెండు, మూడు బంతులను బౌండరీకి తరలించేశాడు. దాంతో ఒత్తిడిలో టామ్ కరన్ ఓ వైడ్ కూడా వేశాడు. నాలుగో బంతికి మహీ ఇంకో ఫోర్ బాదడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయాన్ని అందుకుంది. గతేడాది ప్లే ఆఫ్ చేరకుండా నిష్క్రమించడంతో నిరాశ చేందిన ఫాన్స్.. ఈసారి ఫైనల్లో అడుగుపెట్టడంతో భావోద్వేగానికి గురయ్యారు. పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా ఏడ్చేశారు. దీనికి సంబందించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ అనంతరం ధోనీ తన విన్నింగ్ బాల్‌ను ఓ చిన్నారికి బహుమతిగా ఇచ్చాడు.


Click it and Unblock the Notifications












