Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: 'టీమిండియాకు అత్యధిక వికెట్లు తీయాలనేదే నా కల.. అందుకు అవకాశం వచ్చినప్పుడల్లా కష్టపడతా'

IPL 2021: Mohammed Siraj says My dream is to be highest wicket taker for Team India

చెన్నై: టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీయాలనేదే తన కల అని హైదరాబాద్ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తెలిపాడు. అత్యధిక వికెట్లు తీసేందుకు అవకాశం వచ్చినప్పుడల్లా కష్టపడతానన్నాడు. భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ తనను సొంత కొడుకులా చూసుకుంటాడని సిరాజ్‌ పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. చెన్నై వేదికగా శుక్రవారం జరుగనున్న లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది.

అత్యధిక వికెట్లు తీయడమే నా కల:

అత్యధిక వికెట్లు తీయడమే నా కల:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మహ్మద్‌ సిరాజ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. బెంగళూరు గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన సిరాజ్‌ తన కెరీర్‌ గురించి అనేక అంశాలు పంచుకున్నాడు. 'టీమిండియాకు నేను బౌలింగ్‌ చేసినప్పుడల్లా జస్ప్రీత్‌ బుమ్రా నా పక్కనే ఉండేవాడు. ప్రాథమిక అంశాలకు లోబడి బౌలింగ్‌ చేయమని, అనవసర విషయాలపై దృష్టి పెట్టొద్దని చెప్పాడు.

అతడి నుంచి నేర్చుకోవడం గొప్ప విషయం. ఇషాంత్‌ శర్మతోనూ కలిసి ఆడాను. అతను వంద టెస్టులాడాడు. అతనితో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం మరచిపోలేనిది. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీయడమే నా కల. అందుకు అవకాశం వచ్చినప్పుడల్లా కష్టపడతా' అని సిరాజ్‌ తెలిపాడు.

నాన్న లేరనే వార్త తెలిసింది:

నాన్న లేరనే వార్త తెలిసింది:

'ఆస్ట్రేలియా పర్యటన సమయంలో క్వారంటైన్‌లో ఉండగా.. ప్రాక్టీస్‌ నుంచి తిరిగొచ్చాక మా నాన్న లేరనే వార్త తెలిసింది. దురదృష్టం కొద్దీ ఆ సమయంలో నా గదికి ఎవరూ వచ్చే అవకాశం లేకపోయింది. అప్పుడు మా అమ్మకు ఫోన్‌ చేశా. తను ఎంతో అండగా నిలిచింది. టీమిండియాకు ఆడాలన్న మా నాన్న కోరిక నెరవేర్చాలని చెప్పింది. అందుకే అక్కడే ఉండిపోయా. ఇక కోచ్‌ భరత అరుణ్‌తో మాట్లాడినప్పుడల్లా నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన నా బౌలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నన్ను సొంత కొడుకులా చూసుకుంటారు' అని సిరాజ్‌ చెప్పాడు.

అప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది

అప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది

ఐపీఎల్ 2020‌పై మహ్మద్‌ సిరాజ్‌ స్పందిస్తూ... 'ఐపీఎల్ 2020లో నేను కొత్తగా చేరినప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేను. కొత్త బంతితో బౌలింగ్‌ చేసేకొద్దీ అలవాటు పడ్డా. తర్వాత కేకేఆర్ ‌(4-2-8-3)తో అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పుడు నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆర్సీబీ తీరు‌ బాగుంటుంది. అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు' అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020లో సత్తాచాటడంతో సిరాజ్ ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. అక్కడ కూడా రాణించి ఇంగ్లండ్ పర్యటనలో చోటు దక్కించుకుని అంచనాలను అందుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ 2021పై దృష్టి పెట్టాడు.

Sunil Gavaskar All-Time IPL XI: కెప్టెన్‌గా ధోనీ..మ‌లింగ‌ల‌కు షాక్! నలుగురు బౌలర్లకే అవకాశం!!

Story first published: Thursday, April 8, 2021, 17:56 [IST]
Other articles published on Apr 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+