మరో స్థాయికి..
టీమ్‌లో సీనియర్ క్రికెటర్లు, కెప్టెన్‌గా అనుభవం ఉన్న స్టీవ్‌స్మిత్, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానేలు ఉన్నా.. ఢిల్లీ ఫ్రాంచైజీ 23 ఏళ్ల పంత్‌పైనే నమ్మకం ఉంచింది. ఈ క్రమంలోనే పంత్ అదరగొట్టాలని మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించాడు. 'మ కలను నిజం చేస్తూ ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లిన మా సారథి శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకోవాలి. ఇక మా ఢిల్లీకా కడక్ లాండా రిషభ్ పంత్‌కు ఆల్ ది బెస్ట్. కెప్టెన్సీ రిషబ్ పంత్ ఆటని కచ్చితంగా మరో స్థాయికి తీసుకెళ్తుంది.'అని పేర్కొన్నాడు.

మెరుగైన ఆటగాడిగా..
ఇక కెప్టెన్సీ రిషభ్ పంత్‌ను మెరుగైన ఆటగాడిగా తీర్చుతిద్దుతుందని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఢిల్లీ సారథ్య బాధ్యతలు అందుకునేందుకు అతను అన్ని విధాల అర్హుడని పేర్కొన్నాడు. 'శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమవ్వడం దురదృష్టకరం. రిషభ్ పంత్ తనకొచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నా. తాజా ప్రదర్శనలు, మొక్కవోని ఆత్మవిశ్వాసం దృష్ట్యా ఢిల్లీ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అతను పూర్తిగా అర్హుడు. కెప్టెన్సీ పంత్‌ను మరింత మెరుగైన ఆటగాడిగా మారుస్తుందని నేను భావిస్తున్నా' అని రికీ పాంటింగ్ ట్వీట్ చేశాడు.

నా కల నిజమవుతోంది..
ఏదో ఒక రోజు ఢిల్లీ జట్టును నడిపించాలనేది తన కలని, అది ఇప్పుడు నేరవేరే సమయం ఆసన్నమైందని రిషభ్ పంత్ సంతోషం వ్యక్తం చేశాడు. తనను కెప్టెన్‌గా ప్రకటించిన అనంతరం పంత్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'నేను పెరిగిన ప్రాతం ఢిల్లీ. ఇక్కడే ఆరేళ్ల క్రితం నా ఐపీఎల్ జర్నీ మొదలైంది. ఏదో ఒక రోజు ఈ జట్టుకు సారథ్యం వహించాలనేంది నా కల. అది ఇప్పుడు సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. ఈ బాధ్యతను చాలా గౌరవంగా, గొప్పగా భావిస్తున్నా. ముఖ్యంగా ఇంత పెద్ద బాధ్యతను తనకు ఇచ్చిన టీమ్ ఓనర్స్, మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు. అద్భుతమైన సపోర్ట్ స్టాఫ్, సత్తా కలిగిన సీనియర్ల సహకారంతో నా బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తా'అని పంత్ చెప్పుకొచ్చాడు.

మంచి జోష్‌లో పంత్..
ఇక ఆస్ట్రేలియా పర్యటన నుంచి రిషభ్ పంత్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌పైనా అదే జోరు కనబరిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుసగా అర్ధశతకాలు సాధించాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్ 2021లోనూ కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది. ఏప్రిల్ 9న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.


Click it and Unblock the Notifications
