రిషబ్ పంత్.. టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోను: అజహరుద్దీన్

హైదరాబాద్: భారత యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడడంతో మొత్తం ఐపీఎల్ 2021కు దూరమయ్యాడు. అయ్యర్ గైర్హాజరీలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నాయకత్వ బాధత్యలు అప్పజెప్పింది. ఢిల్లీ కెప్టెన్‌గా పంత్ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా పంత్ సరైనోడని కితాబిస్తున్నారు. ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, చెన్నై ఆటగాడు సురేశ్ రైనా సహా అనేక మంది పంత్ సారథిగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కూడా చేరిపోయాడు.

టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోను
తాజాగా మహ్మద్ అజహరుద్దీన్ ఓ ట్వీట్ చేస్తూ.. రిషబ్ పంత్ టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోను అని పేర్కొన్నాడు. 'రిషబ్ పంత్ కొన్ని నెలలుగా అన్ని ఫార్మాట్లలోనూ అతడేంటో నిరూపించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో అద్భుతంగా రాణించాడు. సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ రేసులో సెలక్టర్ల దృష్టిలో అందరికన్నా ముందున్నా నేను ఆశ్చర్చపోను. అతడి దూకుడైన ఆటతీరు భవిష్యత్‌లో భారత్‌ను మంచి స్థితిలో నిలుపుతుంది' అని అజ్జూ భాయ్ ట్వీటాడు.

రెండు చేతులా అందిపుచ్చుకుంటాడు
'శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమవ్వడం దురదృష్టకరం. రిషబ్ పంత్ తనకొచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నా. తాజా ప్రదర్శనలు, మొక్కవోని ఆత్మవిశ్వాసం దృష్ట్యా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అతను పూర్తిగా అర్హుడు. కెప్టెన్సీ పంత్‌ను మరింత మెరుగైన ఆటగాడిగా మారుస్తుందని నేను భావిస్తున్నా' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.

పంతే సరైనోడు
శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ తన స్థానంలో రిషబ్ పంతే సరైన ఆటగాడనడంలో ఎలాంటి అనుమానం లేదన్నాడు. జట్టుకు అద్భుత విజయాలు అందించాలని ఆకాంక్షించాడు. ఢిల్లీ కెప్టెన్‌గా పంత్ ఎంపికవడంపై సురేశ్ రైనా సంతోషం వ్యక్తం చేశాడు. విజయాలతో ఢిల్లీ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చే సారథి అతను అవుతాడని అభిప్రాయపడ్డాడు. కొత్త బాధ్యతలను గౌరవంతో నిర్వర్తిస్తాడని ట్వీట్ చేశాడు. వేరే కాదు విదేశీ ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

తిరుగులేని ఫామ్‌లో
ఇక ఆస్ట్రేలియా పర్యటన నుంచి రిషభ్ పంత్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌పైనా అదే జోరు కనబరిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుసగా అర్ధశతకాలు సాధించాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్ 2021లోనూ కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది. ఏప్రిల్ 9న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2021 ప్రారంభానికి ముందే చెన్నైకి భారీ షాక్!!