Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తాగిన మైకంలో కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు!

IPL 2021: Michael Slater, David Warner Went into Bar Fight in Maldives
David Warner, Michael Slater టెక్ట్స్ మెసేజ్.. Maldives Bar Fight పై వార్నర్ ఆగ్రహం| Oneindia Telugu

మాలె: తాగిన మైకంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొట్టుకున్నారనే వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. కరోనా దెబ్బతో ఐపీఎల్ 2021 వాయిదా పడటం, భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషేధం ఉండటంతో ఆసీస్ క్రికెటర్లు, ఇతర సిబ్బంది, కామెంటేటర్లు మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి బార్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆసీస్ మాజీ క్రికెట్ మైకేల్ స్లేటర్ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లుగా ది డైలీ టెలి గ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది.

ఈ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు అయినా, తాగిన మైకంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లిందని పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్‌లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది.

ఖండించిన ఆటగాళ్లు..

ఖండించిన ఆటగాళ్లు..

అయితే ఈ కథనాన్ని ఈ ఇద్దరు క్రికెటర్లు ఖండించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, అన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. నిజనిజాలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు కథనాన్ని ఎలా రాస్తారని పత్రికపై మండిపడ్డారు. దీనిపై మొదటగా స్పందించిన స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్‌ఫీల్డ్‌కు ఓ మెసేజ్ పంపించాడు. 'ఇదంతా పుకారే. వార్నర్‌, నేను మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు.'అని స్లేటర్ ఆ సందేశంలో స్పష్టం చేశాడు.

ఆధారల్లేకుండా ఎలా రాస్తారు..?

ఆధారల్లేకుండా ఎలా రాస్తారు..?

ఆ తర్వాత వార్నర్ కూడా టెక్ట్స్ మెసేజ్ పంపించాడు. 'మా మధ్య ఎలాంటి గొడవ, డ్రామా జరగలేదు. మీకు ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మీరు అక్కడ ఉండి లేదా బలమైన ఆధారం ఉంటేనే రాయండి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా రాస్తారు? అసలు అక్కడ ఏమీ జరగలేదు'అని వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన డేవిడ్ వార్నర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసిన విషయం తెలిసిందే. కెప్టెన్సీని తొలగించడంతో పాటు జట్టు నుంచి కూడా తప్పించింది. దాంతో వార్నర్ వాటర్ భాయ్ సేవలిందించాల్సి పరిస్థితి ఏర్పడింది.

ఇక్క‌డి శ‌వాల‌ను చూడండి..

ఇక్క‌డి శ‌వాల‌ను చూడండి..

గత వారం ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రంగా మండిపడిన స్లేటర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇండియా నుంచి వచ్చే ఆస్ట్రేలియా పౌరులపైనా నిషేధం విధించడంపై స్లేటర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'మాన‌వ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావ‌డం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియ‌న్ భ‌యంలో ఉన్నారన్నది ఎంతో నిజం. మీరు మీ ప్రైవేట్ జెట్‌లో వచ్చి.. ఇక్కడి వీధుల్లో ఉన్న శ‌వాల‌ను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్‌ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాను' అంటూ స్లేట‌ర్‌ విరుచుకుపడ్డాడు.

Story first published: Sunday, May 9, 2021, 9:55 [IST]
Other articles published on May 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+