For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RR: మెరిసిన డికాక్.. ముంబై సునాయస విజయం!

IPL 2021, MI vs RR: De Kock, Krunal fire Mumbai to comfortable 7-wicket win in Delhi

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు తమ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్(50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించడంతో ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 రన్స్ చేసింది.

కెప్టెన్ సంజూ శాంసన్(27 బంతుల్లో 5 ఫోర్లతో 42), జోస్ బట్లర్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) రాణించారు. ముంబై బౌలర్లలో చాహర్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, బౌల్ట్ తలో వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 172 రన్స్ చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో మోరీస్ రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ ఓ వికెట్ తీశాడు.

ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(14), క్వింటన్ డికాక్ మంచి శుభారంభాన్ని అందించారు. తొలి రెండు ఓవర్లు డిఫెన్స్‌కు పరిమితమైన ఈ జోడీ.. ఆ తర్వాత గేర్ మార్చింది. సకారియా మూడో ఓవర్‌లో ఫోర్ కొట్టిన డికాక్.. ముస్తాఫిజుర్ మరుసటి ఓవర్‌లో 4, 6 బాదాడు. ఉనాద్కత్ బౌలింగ్‌లో రోహిత్ కూడా సిక్స్‌తో టచ్‌లోకి రాగా.. మోరీస్ బౌలింగ్‌లో డికాక్ మరో సిక్స్ బాదాడు. అయితే ఆ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ క్యాచ్ ఔటవ్వడంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 49 రన్స్ చేసింది.

ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ అతని జోరుకు మోరీస్ బ్రేక్ వేశాడు. సూర్య(16)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి కృనాల్ రాగా.. క్వింటన్ డికాక్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఉనాద్కత్ వేసిన 12 ఓవర్ సెకండ్ బాల్‌ను సింగిల్ తీసిన డికాక్.. 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిదే ఫస్ట్ ఫీఫ్టీ. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. దాంతో మ్యాచ్ పూర్తిగా ముంబై వైపు తిరిగింది. కృనాల్(39)ను ముస్తాఫిజుర్ ఔట్ చేసినా.. క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌తో కలిసి డికాక్ విజయాన్నందించాడు.

Story first published: Thursday, April 29, 2021, 19:20 [IST]
Other articles published on Apr 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+