Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs CSK: పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి ముంబై అద్భుత విజయం!

Pollard 87* helps Mumbai gun down 219-run target vs Chennai
IPL 2021, MI vs CSK Highlights : Kieron Pollard's 34 - Ball 87 Runs | Oneindia telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో 2021 సీజన్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌ అభిమానులు కనువిందు చేసింది. రెండు హోరా హోరీ జట్ల మధ్య ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి తేలిన ఫలితం అభిమానుల గుండెలను తట్టి లేపింది. కీరన్ పొలార్డ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్రకు అడ్డుకట్టవేస్తూ ముంబై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 రన్స్ చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 72 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), మోయిన్ అలీ(36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58) రాణించారు. అనంతరం ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 సిక్స్‌లు నమోదయ్యాయి. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇదే అత్యధిక చేజింగ్ స్కోర్.

సూపర్ స్టార్ట్..

సూపర్ స్టార్ట్..

219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ(24బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), క్వింటన్ డికాక్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) మంచి శుభారంభాన్ని అందించారు. దీపక్ చాహర్, లుంగీ ఎంగిడీ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడటంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 58 రన్స్ చేసింది. అనంతరం అదే జోరులో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జడేజా వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(3) కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా... మొయిన్ అలీ వేసిన 10వ ఓవర్‌లో డికాక్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో మ్యాచ్‌పై చెన్నై పట్టు సాధించినట్లు కనిపించింది.

పోలార్డ్ హాఫ్ సెంచరీ..

పోలార్డ్ హాఫ్ సెంచరీ..

కానీ క్రీజులోకి వచ్చిన బిగ్ హిట్టర్ కీరన్ పొలార్డ్.. కృనాల్‌తో కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సిక్స్‌తో తన విధ్వంసాన్ని మొదలుపెట్టిన ఈ విండీస్ వీరుడు.. జడేజా బౌలింగ్‌లో మూడు, ఎంగిడి ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఇక శార్దూల్ వేసిన 15వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన పొలార్డ్.. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. మరోవైపు కృనాల్ కూడా ధాటిగా ఆడటంతో చెన్నై బౌలర్లు తేలిపోయారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీసేందుకు ధోనీ.. సామ్ కరన్‌‌ను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. కృనాల్‌(32)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 89 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి హార్దిక్ పాండ్యా రాగా.. పొలార్డ్ ధాటిగా ఆడాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 6, 4తో 17 రన్స్ పిండుకున్నాడు. అయితే ఈ ఓవర్‌లో పొలార్డ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఫాఫ్ డూప్లెసిస్ నేలపాలు చేశాడు.

 ఆఖరి బంతికి విజయం..

ఆఖరి బంతికి విజయం..

ఇక సామ్ కరన్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన హార్దిక్ పాండ్యా(16).. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో ఫాఫ్ డూప్లెసిస్‌కు చిక్కాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జిమ్మీ నీషమ్ గోల్డెన్ డక్ అవడంతో ముంబై విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులోకి వచ్చిన ధావన్ కులకర్ణి‌తో చివరి ఓవర్‌లో పొలార్డ్ రెండు ఫోర్లు ఓ సిక్స్ కొట్టడంతో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. క్విక్ డబుల్ తీసిన ఈ జోడీ ముంబైకి అద్భుత విజయాన్నందించింది.

Story first published: Saturday, May 1, 2021, 23:52 [IST]
Other articles published on May 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+