Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs CSK: ముంబై జట్టులోకి మరో ఆల్‌రౌండర్.. చెన్నైదే బ్యాటింగ్!

Mumbai opt to bowl, Neesham makes debut
IPL 2021: Ambati Rayudu's Explosive 72*(27) | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇది మంచి పిచ్ అని, ఇప్పటికే ఇక్కడ ఆడామని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తమ వ్యూహాల్లో భాగంగా జట్టులో రెండు మార్పులు చేశామని తెలిపిన హిట్ మ్యాన్.. నాథన్ కౌల్టర్ నీల్, జయంత్ యాదవ్ స్థానాల్లో ధావల్ కులకర్ణి, జిమ్మీ నీషమ్ జట్టులోకి వచ్చారన్నాడు. తమ ఆటగాళ్లు బిగ్ గేమ్స్ ఆడటానికి చాలా ఇష్టపడుతారని తెలిపాడు. ముంబై తరఫున జిమ్మీ నిషమ్‌కు ఇదే ఫస్ట్ మ్యాచ్.

ఇక తాము కూడా ఫీల్డింగే తీసుకుందామనుకున్నామని సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఆశ్చర్యకరంగా పిచ్ బాగుందని, సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటుందన్నాడు. తమ జట్టులో ఎలాంటి మార్పుల్లేవని తెలిపాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది దూసుకుపోతుండగా.. అన్నే మ్యాచ్‌లాడిన ముంబై మూడింట్లో మాత్రమే విజయం సాధించి వెనుకంజలో ఉంది. చెన్నై తన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ని ఓడించగా.. రాజస్థాన్‌పై ముంబై జయకేతనం ఎగురవేసింది. ఇదే జోరును కొనసాగించాలని ముంబై భావిస్తుండగా.. 2019 ఫైనల్ ఓటమికి రివేంజ్ తీసుకోవాలనే కసితో చెన్నై ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. అయితే గత సీజన్‌లో చెరొక విజయాన్నందుకున్నాయి.

తుది జట్లు:
ముంబై: క్వింటన్ డికాక్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్) సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్, ధావల్ కులకర్ణి, జిమ్మీ నీషమ్

చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, లుంగి ఎంగిడి, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్.

Story first published: Saturday, May 1, 2021, 19:15 [IST]
Other articles published on May 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+