MI vs RCB: విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్.. రోహిత్ శర్మ రనౌట్!!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మొదటి మ్యాచులోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. మంచి టచ్‌లో కనిపించిన సమయంలో హిట్‌మ్యాన్ రనౌటయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి నిరాశగా పెవిలియన్ చేరాడు.

మనసు మార్చుకున్న లిన్:
ముంబై ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వేశాడు. చహల్ విసిరిన చివరి బంతిని పాయింట్, కవర్స్ ఫీల్డర్ల మధ్యలో నుంచి క్రిస్ లిన్ హిట్ చేశాడు. దాంతో సింగిల్ కోసం రోహిత్ శర్మని పిలిచిన లిన్.. ఆపై మనసు మార్చుకున్నాడు. లిన్ పరుగు కోసం పిలవగానే.. రోహిత్ వేగంగా పిచ్ మధ్యలోకి పరుగెత్తకుంటూ వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతిని డైవ్ చేస్తూ అడ్డుకున్నాడు. దీంతో లిన్.. రోహిత్‌ని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు.

కోహ్లీ చాకచక్యం:
అప్పటికే చాలా దూరం వెళ్లిపోయిన రోహిత్ శర్మ మళ్లీ క్రీజులోకి వెళ్లలేకపోయాడు. బంతిని అందుకున్న విరాట్ కోహ్లీ చాకచక్యంగా బౌలర్ చహల్‌కి అందివ్వడంతో.. అతడు వికెట్లను గిరాటేశాడు. దీంతో రోహిత్ (19: 15 బంతుల్లో 1x4, 1x6) రనౌటయ్యాడు. ఆపై రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 24 పరుగుల వద్ద ముంబై మొదటి వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్ అభిమానులు లిన్‌పై మండిపడుతున్నారు. 'అలా ఎలా ఔట్ చేస్తావంటూ' కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

చెలరేగిన లిన్, సూర్యకుమార్:
రోహిత్ శర్మ రనౌటైనా.. క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడారు. ప్రతి ఓవర్లో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకునడిపారు. ముఖ్యంగా లైన్ మూడు భారీ సిక్సులు బాదాడు. అయితే జెమీసన్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ (23) ఔటయ్యాడు. వికెట్ల వెనుక డివిలియర్స్ క్యాచ్ పట్టడంతో ముంబై 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆపై సుందర్ వేసిన 12.5 బంతికి లిన్ (49) ఔటయ్యాడు. గాల్లోకి ఆడిన షాట్‌ను సుందరే క్యాచ్ అందుకున్నాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్లు కోల్పయి 128 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ (7), ఇషాన్ (20) ఉన్నారు.
ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.. అతనిలో ఆ యాంగిల్‌ను చూసి అవాక్కయ్యా: కోహ్లీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications