న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్ర‌విడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.. అతనిలో ఆ యాంగిల్‌ను చూసి అవాక్కయ్యా: కోహ్లీ

IPL 2021: Virat Kohli says I never seen this side of Rahul Dravid
ఆగ్రహం తో ఊగిపోయిన Dravid, Cred Ad కి ఫిదా ! || Oneindia Telugu

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, 'ద వాల్‌'‌ రాహుల్‌ ద్రవిడ్‌.. మైదానంలో ఎంత శాంతంగా ఉంటాడో యావత్‌ క్రికెట్‌ ప్రపంచానికి తెలుసు. భయంకరమైన బౌలర్లను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా అతను ఎంతో ఓర్పు, సహనం ప్రదర్శించి.. శాంతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్టుగా వ్యవహరించాడు. కామ్‌గా ఉంటూ వికెట్ల‌కు అడ్డుగోడ‌లా నిలిచి టీమ్‌ను ఎన్నోసార్లు గ‌ట్టెక్కించిన చ‌రిత్ర ద్ర‌విడ్ సొంతం. అలాంటి రాహుల్ అంద‌రిపైకి గ‌ట్టిగా అరుస్తూ, ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం ఎప్పుడైనా చూశారా?. చూడకపోతే ఈ వీడియో చూడండి.

విషయంలోకి వెళితే... రాహుల్‌ ద్రవిడ్‌కు ఇతరులపై అరిచేంతలా కోపం తెప్పించిన ఘటన ఏమీ లేదు. ఓ యాడ్ ‌(CRED) కోసం ద్రవిడ్‌ యాక్టింగ్‌ చేశాడు. ఈ యాడ్‌లో నటుడు జిమ్‌ షరబ్‌ మాట్లాడుతూ.. క్రెడ్‌లో క్రెడిట్‌ కార్డు బిల్‌ కడితే క్రెడ్‌ కాయిన్స్‌ వస్తాయి. వాటితో క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, రివార్డులు పొందొచ్చు. వినడానికి ఇది హాస్యాస్పదంగా ఉందని, రాహుల్‌ ద్రవిడ్‌ను ముక్కోపి అన్న చందంగా ఉందని ఆయన అంటాడు.

ఆతరువాత రాహుల్ ద్రవిడ్‌ ఫ్రేమ్‌లోకి వస్తాడు. కోపంతో ఊగిపోతూ కనిపించే ద్రవిడ్‌.. ఇతరులపై గట్టిగా అరుస్తూ, బ్యాట్‌తో కారు సైడ్ మిర్రర్ పగలగొడుతూ కనిపిస్తాడు. అంతటితో ఆగకుండా.. 'నేను ఇందిరానగర్‌ గూండా'ను అంటూ హల్‌చల్‌ చేస్తాడు. దీంతో ఆ యాడ్ పూర్తవుతుంది. ఈ యాడ్ వీడియోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట‌ర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయింది. రాహుల్ భాయ్‌ను ఇంత‌కు ముందెప్పుడూ ఇలా చూడ‌లేద‌ని కోహ్లీ కామెంట్ చేశాడు. మిస్టర్‌ కూల్‌ను ఇంతకోపంగా ఎప్పుడూ చూడలేదని క్రికెటర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు అంటున్నారు.

ఇక ఐపీఎల్ 14వ సీజ‌న్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన బెంగ‌ళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో రోహిత్ (19) రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ లిన్, సూర్యకుమార్ ధాటిగా ఆడుతున్నారు. ముంబై 7 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.

MI vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ.. ముగ్గురు ప్లేయ‌ర్స్ అరంగేట్రం! ఓపెనర్‌గా రజత్!MI vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ.. ముగ్గురు ప్లేయ‌ర్స్ అరంగేట్రం! ఓపెనర్‌గా రజత్!

Story first published: Friday, April 9, 2021, 20:30 [IST]
Other articles published on Apr 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X