MI vs RCB: చివరి ఐదు మ్యాచ్‌లు హోరాహోరీగానే.. పైచేయి ఎవరిదంటే?

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌కు మరికొద్ది గంటల్లోనే తెర లేవబోతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్ల సారథులు టీమిండియాకు టాప్ బ్యాట్స్‌మన్ కావడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు జట్లు తలపడ్డ చివరి ఐదు మ్యాచులు హోరాహోరీగానే సాగాయి. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

చెలరేగిన సూర్యకుమార్
ముంబై, బెంగళూరు జట్లు చివరగా అబుదాబి వేదికగా 2020 అక్టోబర్ 28న తలపడ్డాయి. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (74; 45 బంతుల్లో 12×4, 1×6) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసింది. అతడికి మరెవ్వరూ అండగా నిలవకపోవడంతో భారీ స్కోరు చేయలేదు. లక్ష్య ఛేదనలో ముంబై తడబడింది. క్వింటన్ డికాక్ (18), ఇషాన్ కిషన్ (25) త్వరగా ఔటయ్యారు. పాండ్యా సోదరులు త్వరగా పెవిలియన్ చేరారు. అయితే మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (79 నాటౌట్; 43 బంతుల్లో 10×4, 3×6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సూపర్ ఓవర్
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఓ మ్యాచులో బెంగళూరు అద్భుత విజయం సాధించింది. రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. పడిక్కల్ (54), ఫించ్ (52), డివిలియర్స్ (55 నాటౌట్; 24 బంతుల్లో 4×4, 4×6) అర్ధ శతకాలకు తోడు శివమ్ దూబె (27; 10 బంతుల్లో 1×4, 3×6) మెరుపులతో బెంగళూరు 201 పరుగులు చేసింది. ఛేదనలో రోహిత్ (8), డికాక్ (14), సూర్య (0), హార్దిక్ (15) విఫలమయ్యారు. కిషన్ (99; 58 బంతుల్లో 2×4, 9×6) విధ్వంసానికి పొలార్డ్ (60; 24 బంతుల్లో 3×4, 5×6) తోడవ్వడంతో స్కోరును ముంబై సమం చేసింది. అయితే సూపర్ ఓవర్లో బెంగళూరు విజయాన్ని అందుకుంది.

హార్దిక్ మెరుపులు
2019 ఏప్రిల్ 17న వాంఖడేలో జరిగిన పోరులో మొదట బెంగళూరు ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (75; 51 బంతుల్లో 6×4, 4×6), మొయిన్ అలీ (50; 32 బంతుల్లో 1×4, 5×6) అర్ధ శతకాలు చేశారు. ఈ పోరులో ముంబై ఆఖరి బంతికి గెలుపొందింది. డికాక్ (40), సూర్యకుమార్ (29), రోహిత్ (28), ఇషాన్ (21), హార్దిక్ (37 నాటౌట్; 16 బంతుల్లో 5×4, 2×6) సమష్టిగా ఆడారు. అందరూ కలిసి 5 వికెట్ల తేడాతో జట్టును గెలిపించారు.

ఆకట్టుకున్న బుమ్రా
చిన్నస్వామి స్టేడియం వేదికగా 2019 మార్చి 28న జరిగిన పోరులో ముంబై గెలిచింది. మొదట ముంబై 8 వికెట్ల నష్టానికి 187 స్కోర్ చేసింది. రోహిత్ (48), సూర్య (38), హార్దిక్ (32; 14 బంతుల్లో 2×4, 3×6) రాణించారు. ఛేదనలో కోహ్లీ (46; 32 బంతుల్లో 6×4) ఫర్వాలేదనిపించాడు. డివిలియర్స్ (70; 41 బంతుల్లో 4×4, 6×6) సిక్సర్ల వర్షం కురిపించాడు. 12 బంతుల్లో 22 చేయాల్సిన క్రమంలో 19వ ఓవర్లో బుమ్రా కేవలం 5 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఆఖరి ఓవర్లో మలింగ 10 పరుగులే ఇవ్వడంతో బెంగళూరు ఓడింది.

రాణించిన వోహ్రా
2018, మే1న మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. వోహ్రా (45; 31 బంతుల్లో 2×4, 4×6), మెక్‌కలమ్ (37), కోహ్లీ (32) రాణించారు. ఛేదనలో ముంబైకి కలిసిరాలేదు. సౌథీ (2), ఉమేశ్ యాదవ్ (2), సిరాజ్ (2) చెలరేగారు. సూర్య (9), ఇషాన్ (0), రోహిత్ (0)ను 21 పరుగుల్లోపే పెవిలియన్ పంపించారు. డుమిని (23), పొలార్డ్ (13) నిలవలేదు. ఈ క్రమంలో కృనాల్ (23; 19 బంతుల్లో)తో కలిసి హార్దిక్ (50; 42 బంతుల్లో 5×4, 1×6) అర్ధ శతకం సాధించాడు. కీలక సమయంలో హార్దిక్ ఔటవ్వడంతో ముంబై ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
విరాట్ కోహ్లీ ఇంకో 122 పరుగులు చేస్తే.. ఐపీఎల్ 2021లో ఆర్సీబీ కెప్టెన్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే!!