అసలేం జరిగిందంటే..
ముంబై బ్యాటింగ్ సందర్భంగా డికాక్‌తో కలిసి పరుగుతీసే క్రమంలో కిందపడ్డాడు. దాంతో అతని చేతి రాసుకుపోయింది. దీంతో మాయిశ్చరైజర్ కావాలంటూ డగౌట్‌కు సైగలు చేశాడు. డగౌట్ నుంచి అంకుల్‌రాయ్ వచ్చి మాయిశ్చరైజర్‌ను అందించగ.. కృనాల్ దానిని తీసుకొని చేతికి రాసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ఇచ్చే క్రమంలో అనుకుల్ రాయ్ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. మాయిశ్చరైజర్‌ను అతని చేతికి ఇవ్వకుండా ముఖానికి విసిరేసినట్లుగా పడేసి దురుసుగా ప్రవర్తించాడు. ఎదో అనుకుల్ రాయ్ అతనికి పనిమనిషన్నట్లు వ్యవహరించాడు.

ఇంత అహంకారమా?
ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియోలో కృనాల్ పాండ్యా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''కృనాల్ నీ పద్దతి మార్చుకుంటే బాగుంటుంది.. అప్పుడు దీపక్ హుడా.. ఇప్పుడు అనుకుల్ రాయ్.. నువ్వు మారవా అంటూ'' కామెంట్లతో రెచ్చిపోయారు. ఒక్క మ్యాచ్ ఆడితే ఏదో సాధించినట్లు ఫీలవుతావని, గతంలో కూడా అనేకసార్లు దురుసుగా ప్రవర్తించావని మండిపడుతున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా దీపక్ హుడా-కృనాల్ మధ్య జరిగిన గొడవ తీవ్ర వివాదస్పదమైంది.

దీపక్ హుడాతో గొడవ..
బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకారణంగా తనపై నోరు పారేసుకున్నాడని.. టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు తన పరువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ వివాదం భారత క్రికెట్‌లో పెనుదుమారం సృష్టించడంతో విచారణ చేపట్టిన బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు.

సునాయస విజయం..
ఇక రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన ముంబై రెండు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 రన్స్ చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్(27 బంతుల్లో 5 ఫోర్లతో 42), జోస్ బట్లర్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) రాణించారు. ముంబై బౌలర్లలో చాహర్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, బౌల్ట్ తలో వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 172 రన్స్ చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. క్వింటన్ డికాక్(50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో మోరీస్ రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ ఓ వికెట్ తీశాడు.


Click it and Unblock the Notifications












