For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారేవ్వా వాటే కో ఇన్సిడెన్స్.. ఏమన్నా సింకా అసలు! వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 172నే టార్గెట్!

IPL 2021: Last 3 days target set by RCB, SRH, RR is 172

న్యూఢిల్లీ: యాదృశ్చికం అంటే ఇదేనెమో..! ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా గత మూడు మ్యాచ్‌లను పరిశీలిస్తే అవాక్కవ్వాల్సిందే. అవును గత మూడు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు సరిగ్గా 171 పరుగులే చేసాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 171 పరుగులే చేయగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 171 రన్సే చేసింది.

ఇక తాజాగా ముంబై ఇండియన్స్‌తో ముంగిసిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కూడా 171 రన్స్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఫొటోలతో మీమర్స్ నెట్టింట చెలరేగుతున్నారు. వాటే కో ఇన్సిడెన్స్.. ఏమన్నా సింకా అసలు అనే క్యాప్షన్‌తో సూపర్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.ఇక ఈ మూడు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెండు జట్లు ఓడిపోగా.. ఒక్క ఆర్‌సీబీనే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో చివర్లో బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడటంతోనే ఈ పరుగులు వచ్చాయి.

ఢిల్లీ మ్యాచ్‌లో ఏబీడీ ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లతో 23 రన్స్ పిండుకోగా.. చెన్నై మ్యాచ్‌లో కేన్ విలయమ్సన్ కూడా ఒకే ఓవర్‌లో వరుస బౌండరీలతో 20 పరుగులు పిండుకున్నాడు. అయితే హైదరాబాద్‌పై చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి 9 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో సునాయస విజయాన్నందుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ కూడా 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 172 రన్స్ చేసి 9 బంతులు ఉండగానే గెలుపొందడం గమనార్హం.

Story first published: Thursday, April 29, 2021, 20:36 [IST]
Other articles published on Apr 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+