ఆ ఒక్కడు లేకనే గెలుపు ముంగిట చేతులెత్తేసాం: కేఎల్ రాహుల్

షార్జా: బ్యాటింగ్ విభాగం వైఫల్యంతోనే ఓటమిపాలయ్యామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మిడిలార్డర్‌లో వేగంగా 30-40 పరుగులు చేసే ఆటగాడు లేకనే గెలిచే మ్యాచ్‌ల్లో ఓటమికి తలవంచామన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్లు శుభారంభం అందించినప్పటికీ మరోసారి మిడిలార్డర్ విఫలమవడంతో సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ఓటమికి తలవంచింది. దాంతో ప్లే ఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే 13 మ్యాచ్‌ల్లో 8 ఓడిన పంజాబ్.. మరొకటి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టం.

బ్యాటింగ్ వైఫల్యమే..
మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన రాహుల్.. గత రెండేళ్లుగా వెంటాడుతున్న సమస్యే ఈ మ్యాచ్‌లోనూ ఇబ్బంది పెట్టిందన్నాడు. 'ఆరెంజ్ క్యాప్ ధరిస్తున్నందుకు ఆనందంగా లేనని చెప్పను గానీ టీమ్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయితే ఇంకా సంతోషించేవాడిని. సునాయసంగా చేధించాల్సిన లక్ష్యం. బహుషా ఓ 10-15 పరుగులు ఎక్కువగా ఉన్నట్లున్నాయి. భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌ను అడ్డుకోవడం అంత సులువైన పనికాదు. గత రెండేళ్లు బ్యాటింగ్ వైఫల్యం మా జట్టును వేధిస్తూనే ఉంది. ఈ మ్యాచ్‌లోను అదే రిటీప్ అయింది. నిజాయితీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ చాలా చెత్తగా ఉంది. టీమ్ పరిస్థితులకు తగ్గట్లు నేను ఆడుతా. కెప్టెన్‌గా జట్టు బాధ్యతలను స్వీకరించాల్సిందే.

30-40 పరుగులు చేసేవాడు..
టీ20 క్రికెట్‌లో టాప్-2 బ్యాట్స్‌మన్ రాణిస్తున్నప్పుడు మిడిలార్డర్‌లో 500-600 రన్స్ చేయగల ఆటగాళ్లు ఉండాల్సిన అవసరం లేదు. కానీ కనీం 30-40 రన్స్ వేగంగా చేసే బ్యాట్స్‌మన్ అయితే ఉండాలి. కానీ మాకు అలాంటి ఆటగాడు లేడు. షారుఖ్ ఖాన్, ఇతర భారత ఆటగాళ్లు రాణిస్తున్నప్పటికీ.. ఫారిన్ క్రికెటర్లు ఆ బాధ్యతను తీసుకోవడం లేదు'అని నికోలస్ పూరన్, క్రిస్ గేల్, మార్క్‌రమ్‌ను ఉద్దేశించి రాహుల్ అన్నాడు. రాహుల్ చెప్పినట్లుగా మిడిలార్డర్‌లో రాణించే ఆటగాడు లేకనే పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్‌లో చిత్తుగా ఓటమిపాలైంది.

రాహుల్ నాలుగోసారి..
ఇక టీమ్ వైఫల్యం కొనసాగుతున్నా మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం వ్యక్తిగతంగా దుమ్మురేపుతున్నాడు. తాజా మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన రాహుల్.. ఈ సీజన్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఫలితంగా ఐపీఎల్‌లో వరుసగా నాలుగోసారి 500 ప్లస్ రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 2018 సీజన్‌లో 659 పరుగులు చేసిన పంజాబ్ కెప్టెన్.. 2019లో 593 పరుగులు, 2020లో 670 రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 528 రన్స్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలున్నాయి.

మ్యాక్సీ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), ఏబీ డివిలియర్స్(18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 23) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ(3/39), మోయిసెస్ హెన్రీక్స్(3/12) మూడేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసింది. మయాంక్ అగర్వాల్(42 బంతుల్లో 57), కేఎల్ రాహుల్(35 బంతుల్లో 39) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/29) మూడు వికెట్లు తీయగా.. జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్ చెరొక వికెట్ పడగొట్టారు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications