
ముగ్గురిపైనే భారం..
కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ ఔటైతే టీమ్‌ను గట్టెక్కించే బ్యాట్స్‌మెన్ లేకపోవడం ప్రతికూలాంశం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సెంరీ తర్వాత యంగ్ ఓపెనర్ పడిక్కల్ మళ్లీ సత్తా చాటలేకపోతున్నాడు. రజత్ పటిదార్, షాబాజ్ నదీమ్‌పై పెద్దగా ఆశల్లేవు. బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీకి పెద్దగా సమస్యల్లేవు. కానీ ఇన్ని రోజులు అద్భుత ప్రదర్శన కనబర్చిన హర్షల్ పటేల్ తేలిపోతున్నాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన అతను ధారళంగా పరుగులివ్వడం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. అతనితో పాటు జెమీసన్, సిరాజ్, డానియల్ సామ్స్ అంచనాలను అందుకుంటే ఆర్‌సీబీ విజయం సులువే. స్పిన్నర్‌గా చాహల్ ప్రభావం చూపాల్సి ఉంది. జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చు.

ముందుకు సాగాలంటే..
మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఏడు మ్యాచ్‌లు ఆడితే ఐదింటిలో ఓడి ఆరోప్లేస్‌కు పడిపోయింది. లీగ్ దశలో సగం మ్యాచ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో కనీసం ఇక్కడి నుంచైనా పుంజుకుంటేనే ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. టాపార్డర్ వైఫల్యం కోల్‌కతాను వెంటాడుతున్నది. గిల్, రాణా, త్రిపాఠి శుభారంభాన్నివ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. ఆల్‌రౌండర్‌గా ఆండ్రీ రస్సెల్ ప్రభావం చూపకపోవడం అతిపెద్ద లోటుగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లైనప్ విషయంలో మోర్గాన్ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోతే ముందుకెళ్లడం చాలా కష్టం. 150కి పైగా స్ట్రయిక్ రేట్ ఉన్న కరుణ్ నాయర్, వెంకటేశ్ అయ్యర్‌ను ఉపయోగించుకోకపోవడం ప్రతికూలంశం. బౌలింగ్‌లో నరైన్, చక్రవర్తి పర్వలేదనిపిస్తున్నా.. ప్రసిధ్ కృష్ణ, రస్సెల్, శివమ్ మావి గాడిలో పడాలి.
గత మ్యాచ్‌లో దారుళంగా పరుగులిచ్చిన శివమ్ మావిపై వేటు పడే అవకాశం ఉంది.

ముఖా ముఖి పోరు..
ఇరు జట్లు ఇప్పటి వరకు 27 సార్లు తలపడగా కేకేఆర్ 14 విజయాలతో పై చేయి సాధించింది. ఆర్‌సీబీ 13 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే ఈ సీజన్‌లో మాత్రం కేకేఆర్‌పై ఆర్‌సీబీ 38 పరుగులతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ సూపర్ ఫిఫ్టీలతో చెలరేగారు. వీరికి తోడు హర్షల్ పటేల్ కూడా రాణించాడు.

తుది జట్లు అంచనా..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, కైల్ జెమీసన్, డానియల్ సామ్స్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
కోల్‌కతా నైట్‌రైడర్స్: రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమిన్స్, గుర్‌క్రీత్ సింగ్/షెల్డన్ జాక్సన్, శివం మావి/కమలేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తీ, ప్రసిధ్ కృష్ణ
డ్రీమ్ 11 ప్రిడిక్షన్: ఏబీ డివిలియర్స్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(వైస్‌కెప్టెన్), గ్లేన్ మ్యాక్స్‌వెల్, రాహుల్ త్రిపాఠి, ఆండ్రీ రస్సెల్, కైల్ జెమీసన్, ప్రసిధ్ కృష్ణ, శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తీ


Click it and Unblock the Notifications












