
షార్జా: ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనంగా ముగించింది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖారారు చేసుకుంది. కేకేఆర్ సూపర్ విక్టరీతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఆశలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 171 పరుగుల భారీ తేడాతో గెలవాలి. అలా అయితేనే కేకేఆర్‌ను కాదని రోహిత్ సేన టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఇది దాదాపు అసాధ్యం. కాబట్టి కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్లే.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. శుభమన్ గిల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), వెకంటేశ్ అయ్యర్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించగా.. రాహుల్ త్రిపాఠి(14 బంతుల్లో 21) విలువైన పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా తలో వికెట్ తీశారు. అనంతరం చేజింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 85 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ తెవాటియా(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) మినహా అంతా విఫలయ్యారు. శివం మావి(4/21) నాలుగు, లాకీ ఫెర్గూసన్(3/18) మూడు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. షకీబ్ అల్ హన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0)ను షకీబ్ హల్ హసన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. శివమ్ మావివేసిన తర్వాతి ఓవర్లో సంజు శాంసన్(1) ఇయాన్ మోర్గాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫెర్గూసన్ వేసిన నాలుగో ఓవర్లో లివింగ్ స్టోన్(6), అనుజ్ రావత్(0) ఔటయ్యారు. శివమ్ దూబే(18) కాసేపు పోరాడినా.. ఫిలిప్స్ (8), మోరిస్ (0), ఉనద్కత్ (6), సకారియా (1) విఫలమయ్యారు. శివమ్ మావి వేసిన 16.1 బంతికి తెవాతియా చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.