మొన్న ధోనీ.. నిన్న రోహిత్.. నేడు మోర్గాన్.. అదే జరిగితే నిషేధం వేటు!

ముంబై: ఓటమి బాధలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు గట్టి షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 18 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కేకేఆర్ నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌ను ముగించలేకపోయింది. దాంతో ఐపీఎల్ నిబంధనలు ప్రకారం స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ మోర్గాన్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది మొదటి తప్పిదం కాబట్టి.. రూ.12 లక్షలతో సరిపెట్టారు.
టోర్నీలో మరోసారి రిపీట్ అయితే జరిమానా రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మలకు ఈ స్లో ఓవర్ రేట్ సెగ తగిలింది.

ఫస్ట్ టైమ్ కాబట్టి...
ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్, అనూహ్య అంతరాయల సమయాన్ని మినహాయిస్తారు. కానీ చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. దాంతో కెప్టెన్ మోర్గాన్ చర్యలు తీసుకుంటు జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి తప్పిదం కాబట్టి రూ.12 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

రీపీట్ అయితే మ్యాచ్ నిషేధం..
ఐపీఎల్ కొత్త నిబంధనల ప్రకారం ఒక జట్టు మొదటిసారి స్లోఓవర్ రేటు నమోదు చేస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే.. కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో పాటు జట్టులోని ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత లేదా రూ.6 లక్షల జరిమానా ఏది తక్కువైతే దాన్ని వర్తింప జేస్తారు.
ఇక మూడోసారి అదే తప్పు రిపీట్ అయితే మాత్రం కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్ ఫీజులోంచి 50శాతం కోత లేదా రూ. 12 లక్షలు ఏది తక్కువైతే దాన్ని విధించనున్నారు. ఈ లెక్కన మోర్గాన్ మరో రెండు సార్లు స్లో ఓవర్‌రేట్‌కు కారణమైతే ఓ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

ఈ రూల్‌పై ఫ్యాన్స్ ఫైర్..
కొత్తగా తీసుకొచ్చిన ఈ స్లో ఓవర్ రేట్ నిబంధనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 90 నిమిషాల్లో ఓ ఇన్నింగ్స్ ముగించడం కష్టమైన పనని, ఈ రూల్ చాలా కఠినంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. బుద్దిలేనోడు ఈ రూల్‌ను రూపొందించాడని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్‌లో ధోనీ జరిమానాకు గురవ్వగా.. అదే ఢిల్లీతో జరిగిన మరో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫైన్ చెల్లించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications